మునక్కాయ పులుసు వుత్త పప్పు - మునక్కాయ పులుసు ఇది తియ్యగా వుంటుంది అన్నములికి చాల బాగుంటుంది మున్నక్కాయ లతో ఒక్క రసము లేక సాంబార్ లో వేసుకొంటారు ఇది ఒక కొత్త రకము అని అనను ఇది ఒక పాత కాలపు వంటే నండి కానీ చాలా మంది మరిచి పోయి వుంటారు నేను గుర్తు చేస్తున్నాను అంతే మరి నేను ఈ వేళ చేసుకున్నాను మీరు రేపు చేసుకోండి సరేనా దీనికి పెసర బేడ లతో వుత్త పప్పు [COMBINATION]
మునక్కాయ పులుసు కు కావలిసిన పదార్థములు -
- మునక్కాయలు - 2 [ ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి]
- ఉల్లిగడ్డలు - 2 [పొడువుగా సన్నగా ముక్కలు చేసుకోవాలి],-2[లావుగా నలుగు ముక్కలు చేసుకోవాలి]
[ఇలా పైన చూపించిన విదముగా అన్నమాట]
- నూనె - 2 tsp
- ఉప్పు - తగినంత
- బెల్లము - నిమ్మకాయ అంత [లేక తీపు తినగాలిగినంత]
- చింతపండు పులుసు - 4 tsp [ సరిపడ]
- శనగపిండి - 21/2 tsp
- తిరవత గింజలు - 1 tsp [ ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,కరివేపాకు]
తాయారు చేసుకునే పద్దతి -
- మొదట పొయ్యి ముట్టించుకొని నునే వేసుకొని కాగినాక తిరవాత గింజలు వేసుకొని వేగినాక సన్నగా తరుగుకున్న ఉల్లి గడ్డలు వేసుకొని...............
- వేయించుకోవాలి ఎర్రగా అయ్యేవరకు ................. తరువాత లావుగా తరుగు కున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ...............................ఇలా
- పక్కన కుక్కర్ లో కడిగి తరుగుకున్న మునక్కాయల ముక్కలు వేసుకొని కాస్త చింతపండు, బెల్లము ఉప్పు, పసుపు, 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత ముసి ఒక విసిల్ రానిచ్చి పొయ్యి బంద్ చేసుకొని కుక్కర్ దించుకోవాలి .
- ఉల్లిగడ్డలు వేగినాక కుక్కర్ వుడకబెట్టున్న మునక్కాయలు నీళ్ళతో సహా వేసుకొని ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉప్పు,ఒట్టి కారము ,బెల్లము వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక అయిదు నిముషముల తరువాత మూత తీసి తగినంత చింతపండు పులుసు వేసుకొని తరువాత శనగపిండిలో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి కలిపి వుదుకుతూ వున్నా పులుసులో వేసుకొని కలుపుతూ వుండాలి చిక్కదనము చూసుకొని నీళ్ళు వేసుకోవాలి ఒక్క అయిదు నిముషముల తరువాత దించుకోవాలి .[శనగ పిండి వేసినాక పులుసు కలుపుతూవున్దలి లేక పోతే అడుగు అంటుకుంటుంది ]అంతే పులుసు తయ్యర్ .....................................................
ఇప్పుడు వుత్త పప్పు నేర్చుకుందాము మొదట పెసర బేడలు తీసుకొందాము
ఒక చిన్న గ్లాస్ పెసర బేడలు [లేక మీకు ఎంత కావాలి అంటే అంత]తీసుకొని కుక్కర్ వేసుకొని పొయ్యి ముట్టించి ఒక అయిదు నిముషములు వేయించుకోవాలి అంటే కలుపుతూ వుండండి [మీడియం మంట మీద] తరువాత నీటితో ఒక సారి కడిగి మల్లి [మంచి నీళ్ళు] తగినన్ని పోసుకొని మూత ముసి విసిల్స్ వచ్చినాక పొయ్యి బంద్ చేసుకొని
మూత తీయడానికి వచ్చినాక
తగినంత ఉప్పు వేసుకొని గరిటతో బాగా కలిపి గిన్నలోకి తీసుకోండి అంతే వుత్త పప్పు తయ్యార్ .........
note :- వేడి వేడి అన్నములోకి ఈ వుత్హపప్పు వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని మునక్కాయల పులుసు వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది ,లావు లావు ఉల్లిగడ్డలు పెరుగు అన్నములోకి బాగుంటుంది .
No comments:
Post a Comment