బేసన్ పూరి అంటే శనగ పిండి తో పూరి అన్న మాట ఎక్కడికన్నా ఊర్లకి కూర అవి లేకుండా ఇలా చేసుకొని పోవచ్చు చాల రుచి గా వుంటాయి చేయడానికి ఒక పావు గంట చాలు ...........................
కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- శనగపిండి - 10 tsp
- కొత్తిమీర - కాస్త
- పుదిన- కాస్త
- ఉప్పు - 1/4 tsp
- ఎర్ర కారము - 1/4 tsp
- ఉల్లిగడ్డ - 1 [సన్నగా తరగాలి]
- అల్లము వెల్లుల్లి పేస్టు - 1/4 tsp
- గరం మసాల - 1/4 tsp
- కరివేపాకు - కాస్త
- నూనె - 1 tsp
- మైదా పిండి - 1 glass
- నూనె - 1 tsp
- ఉప్పు - కాస్త
అన్ని వేసుకొని పిండి గట్టిగా తడిపి ముసి పెట్టుకోవాలి .
వేయించు కోవడానికి నూనె .
తాయారు చేసుకునే పద్ధతి -
- మొదట పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేగినాక అల్లము వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి
- తరువాత కరివేపాకు ,పుదినా కొత్తిమీర ,శనగపిండి వేసి బాగా కలుపుతువుండాలి [సన్నమoట మీద]
- దీనిలోనే ఉప్పు,కారము వేసి బాగా కలపాలి .
- పొయ్యి బంద్ చేసుకొని నిమ్మరసము ,గరం మసాలా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టాలి .
ఇంక ఇప్పుడు పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగ నియ్యాలి .
- కాస్త చిన్నపిండి వుంట తీసుకొని వత్తు కొని వత్తు కొని
- మధ్యలో ఈ తాయారు చేసుకున్న మిశ్రమము పెట్టుకోవాలి ..........................
- తరువాత మూసుకొవలి ఇలా .................
- కాగుతున్న నూనె లో వేసుకొని కాల్చుకోవాలి ...................
- అప్పుడు ఇలా వస్తుంది అంతే ఎంతో రుచి గ వుండే బేసన్ పూరి తయ్యార్
note - పూరీలు ఎర్రగా కాల్చకూడదు ...
No comments:
Post a Comment