Top Food Blogs

Friday, May 25, 2012

PANAKAM PAPPU ( chikki )

పానకం పప్పు  ఇది ఒక  తీపి  పదార్థము పాతకాలం వంట  పెద్దలకి పిల్లలకి ఎంతో బలమయిన  ఆహారము  ఎన్నో  శుభకార్యాలల్లో  ఇది  తప్పక  పెడతారు చేయడము  చాలా  సులభము . 

తయారు చేసుకునే పద్దతి =  

నీరు - 1/4 glass
చనక్కాయలు - [బుడ్డలు వేయించుకొని పోట్టుతీసుకొని పెట్ట్టుకోవాలి ]- 1 glass 
పప్పులు - 1/4 glass
బెల్లము  - 11/4 glass 

తయారు చేసుకొనే పద్దతి -

  •  మొదట  పల్లీలు [చనక్కాయలు] వేయించుకొని పొట్టు తీసుకోవాలి .

  • పప్పులు కూడ చెనక్కాయలల్లో కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ....


  • పొయ్యి మీద  ఒక  గిన్న  పెట్టుకొని  దంచుకున్న  బెల్లము వేసుకొని నీరు పోసి కలుపుతూ వుండండి ...


  • బెల్లము కరిగినాక  వేరొక  గిన్నలో పల్చటి బట్ట  వేసుకొని
  •   [లేకుంటే కాఫీ  కానీ టీ  వడ  పోసుకునేది ]పెట్టికొని కరిగిన  బెల్లం నీటిని వడ  పోసుకోవాలి
  •  [దీని వల్ల  బెల్లము లో వున్న గలీజు (అంటే ఇసుక అలాంటివి) పోతుంది ]

వడ  పోసుకున్న  బెల్లము నీటిని పొయ్యి మీద  పెట్టి     వుడకనియ్యాలి .

  • పక్కన  చిన్న  పళ్ళెం లో కాస్తనీరు  వేసుకొని పెట్టుకోవాలి 
  • ఉడుకుతున్న  బెల్లము కలుపుతూ వుండాలి కాస్త  చిక్క పడుతుంది అంటే కాస్త  నీరు పోసుకున్న  పళ్ళెములో వేసుకొని చూడాలి  ఇలా ....


  • ఇలా నీటిలో పక్కకి పోకూడదు ఇలా వుండాలి ...

  • వేలితో  ఇలా అంటే వుంటలా రావాలి ఇలా 
వుంట  పాకం [గట్టి పాకం,ముదురు పాకం] 


  • వెంటనే  పొయ్యి  బంద్  చేసుకొని గిన్న  కింద  పెట్టుకొని వేయించుకున్న  చనక్కయలు వేసుకొని బాగా కలుపుతూ వుండాలి 


  • కావలిసిన  వారు  ఉండలు మాదిరి చేసుకోవచ్చు లేదు అంటే కాస్త  చల్లారే  వరకు  కలుపుతూ  వుండాలి  , తరువాత  పల్లెములోకి   తీసుకొని బాగా చల్లారినాక  డబ్బాలోకి వేసుకోవచ్చు. 


  

No comments:

Post a Comment