Top Food Blogs

Saturday, May 26, 2012

DONDAKAYA KOBBERA VEPUDU

దొండకాయ  కొబ్బెర  వేపుడు - ఎప్పుడు  దొండకాయ  కూర  ఒకే  మాదిరి  చేసుకొంతువుంటాము  కానీ  కాస్త  పుల్లగా  వున్నా  దొండకాయలు ఇలా  చేసుకొంటే  కమ్మగా వుంటుంది .

దొండకాయ  కూరకు కావలిసిన  పదార్థములు -         
దొండకాయలు  - 1/4 kg                                            ఒట్టి మిరపకాయలు - 6 
మినప బేడలు - 1 tsp 
శనగబేడలు - 1/2 tsp 
చెనక్కాయలు - 3 tsp [పల్లీలు వేయించి పొట్టు తీసుకోవాలి]
ధనియాల  పొడి - 1/4 tsp
ఎల్లిపాయలు - 5 పాయలు [తెల్లగడ్డలు]
నూనె - 8 tsp 
తిరవాత గింజలు - మినప ,శనగబేడలు ,ఆవాలు, జీలకర్ర,కరివేపాకు  అన్ని కలిపి  11/2 tsp 

తయారు చేసుకునే పద్దతి  =

మొదట  మినపబేడలు,శనగబేడలు,ఒట్టి మిరపకాయలు అన్ని వేయించుకొని ,ఉప్పు ,ధనియాల  పొడి ,ఒట్టి       కొబ్బెర  అన్ని కలిపి ,
వేయించి పొట్టు తీసుకున్న  పల్లిలతో సహా మిక్సీ లో వేసుకొని పొడి చేసుకొని                                      పెట్టుకోవాలి .

తరువాత  దొండకాయలు తరుగుకొని పెట్టుకోవాలి 


పొయ్యి ముట్టించి పెన్నము  పెట్టుకొని  నూనె  వేసుకొని 
కాగినాక  పొట్టు తీసుకున్న  ఎల్లిపాయలు తిరవాత  గింజలు వేసుకొని వేగినాక  దొండకాయ  ముక్కలు వేసి బాగా వేయించు కున్నాక  [నూనె  ఎక్కువగా వుంటే తీసుకొని ] మొదట  తయారు  చేసుకున్న  పొడి  వేసుకొని  బాగా కలిపి  రెండు నిముషముల  తరువాత  దించుకొని వేడి వేడి అన్నములో ఆరగించండి ఎంతో రుచిగా వుంటుంది .






 








No comments:

Post a Comment