Top Food Blogs

Monday, May 28, 2012

MULLANGI PACHHADI [ ROTI PACHHADI ] FOR RICE


ముల్లంగి అంటే  అందరికి ఇష్టము వుండదు కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనితో ఎన్నో రకాలు  వున్నాయి  చేసుకోవచ్చు మరి ఈ  వేల  పచ్చడి చేసుకుందాము  అన్నము   లోకి  చాలా బాగుంటుంది .

పచ్చడి కి కావలిసిన  పదార్థములు - 

టమోటా - 3 [ ముక్కలు చేసుకోవాలి ]

ముల్లంగి - 1 [ తురుముకొని పెట్టుకోవాలి ]

ఉల్లిగడ్డలు - 2 [ముక్కలు చేసుకోవాలి ]

పచ్చి మిరపకాయలు - 4 

ఒట్టి  మిరపకాయలు - 4 ,ఉప్పు - తగినంత ,నూనె - 4 tsp
చి0త పండు - కాస్త ,మెంతులు - 1/4 tsp, జీలకర్ర - 1/4 tsp ,కరివేపాకు - కాస్త 

తాయారు చేసుకునే పద్ధతి -


  • మొదట  చింతపండు  కడిగి నాన బెట్టుకోవాలి .
  • ముల్లంగి చెక్కు తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి .
  • పొయ్యి  ముట్టించుకొని పెన్నము పెట్టుకొని ఒక రండు చెంచాల నూనె వేసుకొని ఒక  ఉల్లిగడ్డ ముక్కలు  గా  చేసుకున్నవి,  ప చ్చిమిరపకాయముక్కలు, ఒట్టి మిరపకాయలు ,టమోటాలు వేసి మగ్గబెట్టుకొని చింతపండు వేసి పొయ్యి బంద్  చేసి చల్లరినక తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ లో పేస్టు చేసుకొని పెట్టుకోవాలి .

  • మల్లి  పొయ్యి ముట్టించి  పెన్నము పెట్టుకొని  నూనె  వేసుకొని కగినాక మెంతులు,జీలకర్ర వేసి వేగినాక  మిగిలిన ఒక ఉల్లిగడ్డ సన్నగా తరుగుకొని వేసుకోవాలి కాస్త వేగినాక తురుముకున్న ముల్లంగి కూడా వేసుకొని సన్నని మంట మీద బాగా వాసన పోయే వరకు వేయించుకోవాలి .



  • మగ్గినతరువాత  మొదట   తాయారు చేసున్న టమోటా వుల్లిగడ్డల గుజ్జు వేసుకొని బాగా కలిపి కరివేపాకు కాస్త కొత్తిమీర వేసుకొని దించుకోవాలి అంతే  ఎంతో రుచికరమయిన ముల్లంగి పచ్చడి తయ్యార్ .

























































x

No comments:

Post a Comment