మజ్జిగ పులుసు = ఇది అన్నము లోకి రొట్టె లో కి బాగుంటుంది చేయడము సులబము తక్కువ సమయము పడుతుంది.ఒకొక్క సరి మజ్జిగ మిగిలి పోతుంది లేదా పుల్లగా వుంటుంది అప్పుడు ఇలా చేసుకోవచ్చు.
కావలిసిన పదార్థములు -
- పుల్ల మజ్జిగ - 1/4 liter
- పచ్చిమిరపకాయలు - 6 ,అల్లము - చిన్నముక్క,కొత్తిమీర - కాస్త,ఒట్టి కొబ్బెర - 2 tsp,ఉప్పు అన్నికలిపి మిక్సీ లో తిప్పుకొని పెట్టుకోవాలి
- ఉల్లిగడ్డలు - 1 పొడువు ముక్కలు చేసుకోవాలి
- వంకాయలు - 2
- తెల్ల గుమ్మడి కాయ - కాస్త [పైన తోలు తీసి చిన్న ముక్కలు చేసుకోవాలి]
- బెండకాయలు - 5
- క్యారట్ - 1 చిన్నది [కావాలి అంటే వేసుకోండి ముక్కలు చేసుకొని]
- నూనె - 2 tsp
- తిరవాత గింజలు - 1 tsp [ఆవాలు,మినప బేడలు,జీలకర్ర,కరివేపాకు]
- శనగ పిండి - 3 tsp
- మొదట ఒక గిన్న తీసుకొని నూనె వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక వుల్లిగడ్డ ముక్కలు వేసి ఒక నిముషము వేగినాక
- తరుగు కున్న బెండకాయ,వంకాయ,గుమ్మడికాయ,క్యారట్ ముక్కలు వేసుకొని కాసేపు కలిపి [ఒక అయిదు నిముషములు]కాస్త పసుపు వేసుకొని ఒక గ్లాస్ నీరు వేసుకొని మూత పెట్టుకోవాలి .
- ఒక పది నిముషముల తరువాత మూత తీసి మొదటే తిప్పుకున్న పచ్చికారము వేసుకోవాలి [ఈ కరము మరి ఒక గంట ముందర అల తిప్పుకోవద్దు నసరు వాసన వస్తుంది]
- ఒప్పలు వుడికిన తరువాత పెరుగులో శనగ పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి ఉడుకుతున్న పులుసు లో వేసుకోవాలి కావలిసి వస్తే తగినాన్ని నీరు వేసుకొని ఒక ఉడుకు రానియ్యండి .
- శనగ పిండి పచ్చి వాసన పోతుంది అంతే ఎంతో రుచి కరమయిన మజ్జిగ పులుసు తయ్యార్ ...........
No comments:
Post a Comment