Top Food Blogs

Friday, February 3, 2012

PESARATTU [ TIFFIN ]

పెసరట్టు = ఇది ఒక టిఫిన్ ఐటెం ఎండాకాలములో  తింటే చలువ ఆరోగ్యకరమయినది .

కావలిసిన పదార్థములు = 
  • పొట్టు పెసలు - 1 గ్లాస్ [5 గంటలు నీటిలో బాగా నన బెట్టుకోవాలి,తరువాత బాగా పిసికి పొట్టు వూడుతుంది అప్పుడు పొట్టు అంత తీసి పరవేయండి అలా ఒక   మూడు సార్లు కడగండి చాలు కాస్త పొట్టు వున్నా పర్వాలేదు]
  • పచ్చిమిరపకాయలు - 4
  • అల్లము - కాస్త 
  • కొత్తిమీర - కాస్త 
  • ఉల్లిగడ్డలు - 11/2
  • ఉప్పు - తగినంత 
  • ఉల్లిగడ్డలు - 4 [సన్నగా తరిగి పెన్నములో ఒక చెంచ నూనె వేసుకొని వేయించుకొని ఒక రెండు నిముషములు పక్కన పెట్టుకోవాలి]
 
తాయారు చేసుకునే పద్ధతి = 
  • మొదట పచ్చి మిరపకాయలు,ఉప్పు,అల్లము,కొత్తిమీర మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలి తరువాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కచ్చ పచ్చగా తిప్పుకొని పెట్టుకోవాలి ఇలా ........
  • కడిగి పెట్టుకున్న బ్యాల్లు మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలి మెత్తగా అయిన తరువాత మొదట  తిప్పుకున్న కారము  వేసుకొని ఒక్క సారి తిప్పుకుంటే సరి, పిండి తయార్ అవుతుంది .[కారము మెదిగిన పిండి లో వేసుకొని తిప్పుకోవాలి ఎందుకు అంటే ఉల్లిగడ్డ పిండి తో తిప్పుతే దోసలు మెత్తగా వస్తాయి]
  • తయార్ అయ్యిన పిండి లో జీలకర్ర వేసుకొని కలిపి పెన్నము పెట్టుకొని దోస వేసి రెండు వాయిపుల కాల్చుకోవాలి 

  • అంతే దోస తయార్ ...........ఇంకా మొదట  సన్నగా తరుగు కున్న ఉల్లిగడ్డ ముక్కలు అద్దుకొని [నంచుకొని]  దోస  తినాలి .

No comments:

Post a Comment