Top Food Blogs

Thursday, February 2, 2012

MUKKALA SAMBAR [WITH RICE ]

సాంబార్ = ఇది  అన్నములోకి బాగుంటుంది .ఎప్పుడు తాలింపు కూర అంటే విసుగు కదా అందుకే ఇలా అన్నమాట .


తయారుకు కావలిసిన వస్తువులు =

  • కందిబేడలు - 1 glass
  • మెంతులు - 1/4 tsp
  • తిరవాత గింజలు-మినపబేడలు,ఆవాలు,జీలకర్ర -1tsp
  • చింతపండు గుజ్జు - తగినంత
  • బెల్లము - తగినంత 
  • కూర గయ ముక్కలు - క్యారట్ - 2,వంకాయ-1   బీరకాయ - 1/2 ,టమోటా -2 ,కయాలి ఫ్లవర్ - కాస్త ఇంకా ఎమన్నా వుంటే వేసుకోవచ్చు 
  • ఉల్లిగడ్డలు - 2 [పొడువుగా ముక్కలు చేసుకోవాలి]
  • పచ్చి మిరపకాయలు - 5 [ పొడువుగా ముక్కలు చేసుకోవాలి 
 తాయారు చేసుకునే పద్ధతి =

  • మొదట కంది బేడలు మెత్తగా ఉడక బెట్టుకోని ఎనుపుకొని పెట్టుకోవాలి .
 
  • తరువాత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి .
  • కూరగాయలు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి 
  • ఒక గిన్న పొయ్యి మీద పెట్టుకొని ఒక రండు చెంచాల నూనె వేసుకొని కగినక తిరవాత గింజలు,మెంతులు  వేసుకొని కాస్త వేగినాక 
  • తరుగుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఎర్రగా వేగ నిచ్చి ,
  • తరుగుకున్న మిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఒక రండు నిముషములు వేయించుకున్న తరువాత 
  • కూరగాయ ముక్కలు వేసుకొని ఒక అయిదు నిముషముల వేయించుకున్న తరువాత [ఎందుకు అంటే కురలల్లో వుండే పచ్చి వాసన పోయిన తరువాత]
  • ఒక గ్లాస్ నీరు వేసుకొని 1/4 tsp పసుపు,తగినంత బెల్లము,కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి .
  • కూరలు వుడికిన తరువాత ఎనుపుకున్న పప్పు, తగినంత చింతపండు పులుసు,తగినన్ని నీరు వేసుకొని 
  • ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని ,కొత్తిమీర,కరివే పాకు వేసుకొని ఒక ఉడుకు వస్తేనే పొయ్యి బంద్ చేసుకోవాలి అంతే ఎంతో రుచి కరమయిన సాంబార్ తయ్యార్ ..
  

No comments:

Post a Comment