Top Food Blogs

Wednesday, January 25, 2012

VANKAYA PULUSU [ FOR RICE ]

 
వంకాయ పులుసు = ఇది అన్నము లోకి బాగుంటుంది ఎప్పుడు కూర పప్పు  తినే కంటే అప్పుడప్పుపుడు ఇలా పులుసులు చేసుకుంటే బాగుంటుంది.

కావలిసిన పదార్థములు - 
  1. వంకాయలు - 1/4 kg
  2. టమోటాలు - 2
  3. ఉల్లిగడ్డలు - 2 
  4. ఎల్లిపాయలు - 1 గడ్డ[పొట్టు తీసుకొని పెట్టుకోవాలి]
  5. వట్టి మిరపకాయలు - 7
  6. ధనియాలు - 1/2 tsp
  7. జీలకర్ర - 1/4 tsp
  8. ఒట్టి కొబ్బెర - తురుముకున్నది - 2 tsp
  9. నూనె - 2 tsp
  10. తిరవాత గింజలు - 1 tsp
  11. బెల్లము - ఒక గడ్డ [ చిన్నది ]సరిపడ
  12. చింత పండు - 25 grms 
  13. పప్పుల పొడి - 4 tsp 
తాయారు చేసుకునే పద్ధతి = 
  • ఒక పెన్నము లో ఒక చెంచా నూనె వేసుకొని ధనియాలు,జీలకర్ర,ఒట్టిమిరపకాయలు,వేసి వేయించుకొని పొయ్యి ఆఫ్ఫ్ చేసుకొని ఒట్టి కొబ్బెర వేసుకొని కలిపి చల్లరినక మిక్సీ లో పొడి చేసు కొని పెట్టు కోవాలి .[మరి మెత్త గ చేసుకోరాదు]
  • చింత పండు ఒక గిన్నలో తీసుకొని కడిగి నీరు వేసి నన బెట్టుకొని ,నానినాక గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి .
  • బాణలిలో  నూనె  వేసుకొని  ఎల్లిపాయలు వేసి ఒక సారి కలిపి ఉల్లిగడ్డలు,తిరవాత గింజలు వేసుకొని వేయించుకోవాలి .
  • తరువాత ముక్కలు గ చేసుకున్న              వంకాయలు ,టమోటా పండ్లు వేసుకొని కలిపి పసుపు,ఉప్పు,బెల్లము వేసుకొని బాగా కలిపి ఒక గ్లాస్ నీరు వేసుకొని మూత పెట్టుకొని వుడకనియ్యాలి.
  • ముక్కలు అన్ని ఉడికి నాక తాయారు చేసుకున్న పొడి వేసుకొని సరిపడ చింతపండు పులుసు వేసుకొని .
  • మరి ఒక చిన్న గ్లాస్ నీటిలో పప్పుల పొడి వేసుకొని కలిపి తరువాత ఉడుకు తున్న మక్కలలో వేసుకొని బాగా కలుపుకోవాలి{సాంబార్ కంటే చిక్కగా వుండాలి}
  • ఇది తియ్య తియ్య గ పుల్లపుల్లగా వుంటుంది .ఒక 8 నిముషములు వుడికినాక దించి అన్నములో తినండి 


No comments:

Post a Comment