Top Food Blogs

Thursday, January 19, 2012

TRADITIONAL GULAB JAAMUN (NOT WITH READY MADE POWDER)

గులాబ్  జామున్ = గులాబ్  జామున్ అంటే అందరికి తెలుసు రెడీమేడ్ పొడి తెచ్చుకొని చేసుకుంటారు కానీ మన అమ్మ అమ్మ వాళ్ళ చిన్నప్పుడు అలా కాదు మరి ఎలా అంటారా ఇలా మా అమ్మ చెప్పింది,చేసి చూసినాను రెడీమేడ్ పొడి తో చేస్తే వచ్చే రుచికి దీనికి ఎంతో తేడ వుంది చాలా చాలా బాగుంది దానికంటే చేయడము సులబము చేసి చుడండి మరి .............

కావలిసిన పదార్థములు =
  1. మైదా - 250 grms
  2. సోడా పొడి - 1 tsp
  3. నెయ్యి - 60 grms
  4. కమ్మటి పెరుగు - సరిపడా 
  5. వేయించుకోవడానికి సరిపడా సోగం నూనే నెయ్యి వేసుకోండి {ఎక్కువ నెయ్యి తక్కువ నూనే కూడా వేసుకోవచ్చు మిగిలినేది బిసిబెళ బాత్ తిరువతకి వేసుకోవచ్చు}
తాయారు చేసుకునే పద్ధతి = 
  • మొదట మైదా ,సోడా పొడి వేసుకొని ఒక సారి బాగా కలపాలి 
  • తరువాత  నెయ్యి వేసుకొని వుంటలు లేకుండా బాగా కలుపుకొని 
  • తరువాత కాస్త కాస్త కమ్మటి {fresh curd}పెరుగు వేసుకుంటూ చేపతి పిండి లాగా కలుపుకొని పెట్టుకొని {తగినంత పెరుగు చూసుకొని వేసుకోవాలి}
  • వేయించు కోవడానికి పొయ్యి మీద నూనే పెట్టుకోవాలి  
  • తరువాత జామున్లు చేసుకొని పెట్టుకొని

  • కాగిన నూనే లో వేసుకొని మద్యస్తపు మంట మీద వేసుకొని కాల్చుకోవాలి బంగారు వర్ణములోకి 
పాకము తయారికి = 
రెండు గ్లాస్ ల చెక్కర కి 
ఒక గ్లాస్  నీరు 
వేసుకొని చెక్కర కరిగినాక ఒక పదినిముషాలు పొయ్యి మీద వుంచుకోవాలి కలుపుతూ వుండాలి 
తరువాత పొయ్యి బంద్ చేసుకోవాలి 
  • వేగిన జామున్లు తాయారు చేసుకున్న పాకములో వేసుకోవాలి ఒక అయిదు నిముషముల తరువాత అందరికి పెట్టండి వేడి వేడిగా ..........

1 comment: