బొంబాయిరవ్వ తో దోస పుల్లగా కమ్మగా బాగుంటుంది =
కావలిసిన పదార్థములు =
- బొంబాయి రవ్వ - 1 glass
- పెరుగు - 1/2 glass
- ఉల్లిగడ్డ - 11/2 [సన్నగా ముక్కలు చేసుకోవాలి]
- పచ్చిమిరపకాయలు-4, ఉప్పు-తగినంత, కొత్తిమీర-కాస్త అన్ని కలిపి మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి .
- సోడ పొడి - చిటికెడు
- ఉప్పు - తగినంత
- మొదట రాత్రే పెరుగు లో రవ్వ వేసుకొని కలిపి పెట్టుకోవాలి [కావలిసి వస్తే తగినంత నీరు వేసుకొని పెట్టుకోండి]
- ఉదయము దోస వేసుకునే పెన్నము పెట్టుకొని,అంతలోకి రాత్రి కలుపుకున్న పిండి లోకి వుల్లిగడ్డ ముక్కలు,కారము,కాస్త సోడ పొడి వేసుకొని దోస పిండి అంత జారుడు గ [పల్చగా]వుండే లాగా [తగినంత నీరు వేసుకొని]కలుపుకోవాలి .
- కాస్త కొత్తిమీర వేసుకొని కాలుతున్న పెన్నము మీద దోస వేసుకొని సన్న మంట మీద మూత మూసుకొని కాల్చుకోవాలి
- ఒక సైడ్ కాలినాక రెండవ సైడ్ కాల్చుకునే టప్పుడు పెద్ద మంట పెట్టండి .అలాగా పెరుగు రవ్వ దోస తయ్యారు అవుతుంది .
No comments:
Post a Comment