Top Food Blogs

Friday, January 6, 2012

GREEN PEAS GUGGULLU [ SNACK ITEM ]

E
గ్రీన్ పీస్ గుగ్గుల్లు = ఎన్నో రకాల  స్నాక్స్  తింటారు  కానీ ఆరోగ్య కరమైనవి తినడము  ఎంతో మంచిది  మరి ..............................ఈ కాలము లో దొరికే ఈ పచ్చి బఠానీలు ఎంతో ఆరోగ్య కరము వీటితో ఇలా గుగ్గుల్లలా  చేసుకోవచ్చు ,ఇది ఒక స్నచ్క్ ఐటెం మరి చేద్దాము ..............................................


కావలిసిన పదార్థములు = 

  1. పచ్చి   బఠానీలు  - 250 grms
  2. ఉల్లి గడ్డలు - 2 [ చిన్నవి]
  3. పచ్చి కొబ్బెర - 1/2 చిప్ప 
  4. పచ్చి మిరపకాయలు - 5 
  5. ఉప్పు 
  6. కొత్తిమీర - కాస్త
  7. నూనె - 2 tsp
  8. తిరవాత గింజలు - ఆవాలు,మినప బేడలు,కరివేపాకు 
చేసుకునే  విధానము = 
    • మొదట  బఠానీలు  వలుచుకొని పెట్టుకోవాలి.
    • పచ్చికోబ్బెర  తురుముకొని పెట్టుకోవాలి.
    • ఉల్లి గడ్డలు తరుగుకొని పెట్టుకోవాలి .
    ఒక గిన్నలో నూనె వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక ఉల్లిగడ్డలు వేసుకొని ఒక రండు నిముషముల తరువాత పచ్చి బఠానీలు వేసుకొని ఒక రెండు నిముషములు కలుపుకున్న తరువాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కాస్త పసుపు వేసుకొని  మూత ముసుకోవాలి సన్న మంట  మీద .
    అవి వుడికే లో కి మిక్సీ లో పచ్చిమిరపకాయలు,ఉప్పు,కొత్తిమీర వేసుకొని తిప్పుకోవాలి అప్పుడు కారము తయ్యారు అవుతుంది .
    [పచ్చి కారము ఎప్పుడు మరి మెత్త గ వేసుకోవద్దు దేనిలోనయిన రుచి బాగుండదు కాస్త ముక్కగా వేసుకోండి]
    భఠానీలు ముఠా తీసి చుస్తువుందండి తొందరగా వుడుకుతాయి కాస్త నీరు ఉండేలాగా చూసుకోండి వుడికిన వెంటనే తిప్పుకున్న కారము వేసుకొని ఒక అయిదు నిముషముల తరువాత పొయ్యి బంద్  చేసుకొని పచ్చి కొబ్బెర తురుము వేసుకొని బాగా కలిపి వేడి వేడి గ ఆరగించండి .

    No comments:

    Post a Comment