Top Food Blogs

Thursday, January 5, 2012

TIYYA PAPPU (or) MENTHI PAPPU

మెంతి పప్పు
మెంతి పప్పు ఇది  కమ్మగా వుంటుంది.ఇది అన్నములోకి చాలా బాగుంటుంది కూరలు లేనప్పుడు ఎప్పుడు కూరగాయల పప్పు తినాలి అంటే విసుగు వచ్చినప్పుడు ఇది చేసుకోవచ్చు.

కావలిసిన వస్తువులు =

  • కంది బేడలు - 1 కప్పు 
  • ఒట్టి మిరపకాయలు - 8
  • ఉల్లిగడ్డ 
  • మెంతులు - 1/2 tsp
  • నూనె - 2 tsp
  • ఇంగువ - చిటికెడు 
  • చింతపండు - తగినంత 
  • ఉప్పు 
  • బెల్లము - తగినంత 
తాయారు చేసుకునే పద్ధతి - 

  • మొదట  ఒక  గిన్న తీసుకొని నూనె వేసుకొని మెంతులు వేసుకొని ఒక నిముషము తరువాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి కాస్త వేయించుకొని ఒట్టి మిరపకాయలు,ఇంగువ,కంది బేడలు అనీ వేసుకొని సన్న మంట మీద  వేయించుకోవాలి  ఒక పది నిముషాలు [కలుపుతూ వుండాలి {లేకుంటే మాడిపోతాయి}]


  • తారువాత  రెండు గ్లస్సుల నీరు వేసుకొని కాస్త పసుపు వేసుకొని మూత  పెట్టుకోవాలి సన్న మంట మీదనే       [లేదు అంటే వేయించుకున్న బేడలు కుక్కర్ లో వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని విసిల్లు రాణించి దించుకోవాలి,తరువాత చింతపండు,ఉప్పు,బెల్లము వేసుకొని బాగా ఎనుపుకోవాలి ]ఉడికించుకోవాలి ,మధ్య మధ్య లో చూస్తూ వుండాలి  బ్యాళ్ళు వుడికినాక తగినంత చింత పండు,ఉప్పు,బెల్లము వేసుకొని కాస్త మగ్గినక  పప్పు గుత్తి తో మిరపకాయలు నలిగే తట్టు బాగా ఎనుపుకోవాలి అంతే తియ్య పప్పు తయ్యార్ ......

పప్పు గుత్తి అంటే ఇది దీనితో ఎనుపుతే బాగా కలుస్తుంది.





No comments:

Post a Comment