ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ = మాములు గ ఆమ్లెట్ బ్రెడ్ లో కానీ లేక కుర కానీ చేస్తారు ఎగ్ బిరియాని మరి ఇది మసాల లేకుండా బాగుంటుంది చేసి చూడండి.
కావలసిన పదార్థములు =
- ఎగ్గ్స్ - 4
- ఉల్లిగడ్డలు - 4 [చిన్నవి]
- మిరియాలపొడి - 1 tsp
- షాజీరా - 1/2 tsp
- ఉప్పు - తగింనంత
- పచ్చిమిరపకాయలు - 3
- లవంగాలు - 3
- నూనె - ఒక 8 tsp
- బాసుమతి రైస్ - 1 glass ఉడకబెట్టుకొని చల్లర్చుకోవాలి
- మొదట అన్నము చేసుకొని పక్కన పెట్టుకోవాలి .
- ఒక గిన్నలో గుడ్డు ఒకటి పగలగొట్టి కాస్త ఉప్పు,మిరియాల పొడి కాస్త వేసి కలిపి కాలుతున్న పెన్నము మీద పల్చగా వేసుకొని కాల్చి ముక్కలుగా చేసుకోవాలి.
- {ఒకోక్క గుడ్డు తీసుకొని ఆమ్లెట్స్ వేసుకోవాలి పల్చగా}
- రైస్ కి తిరువాత వేసుకోవ డానికి గిన్న పెట్టుకోవాలి నూనె వేసి కాగినాక లవంగాలు,పలచగా ముక్కలు చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని,శాజీర వేసుకొని బాగా వేయించుకొని కాస్త తరువాత పచ్చిమిరపముక్కలు వేసుకొని వేయించుకొని వేగినాక అన్నము,తగినంత ఉప్పు వేసుకొని మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ముక్కలుగా చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసుకొని బాగా కలిపి మూత మూసుకొని ఒక అయిదు నిముషముల తరువాత వేడి వేడిగా వడ్డించండి .
No comments:
Post a Comment