పుదిన పచ్చడి - పుదిన ఆరోగ్యము రుచి మంచి వాసన తో వుంటుంది ,ఇది అన్నములోకి పుల్కలోకి బాగుంటుంది.
కావలిసిన పదార్థములు -
- పుదిన - ఒక కట్ట [ఆకులు వలుచుకొని రెండు సార్లు కడిగి పక్కన్న పెట్టుకోవాలి]
- పచ్చిమిరపకాయలు - ఒక అయిదు
- చింతపండు - కాస్త నాన బెట్టుకొని పెట్టుకోవాలి
- బెల్లం - కాస్త [తగినంత]
- ఉప్పు - తగినంత
- మినప బేడలు - ఒక చెంచ
- శనగ బేడలు - ఒక చెంచ
- కాస్త ధనియాలు
- నాలుగు మెంతులు
- మొదట మినప,శనగ,ధనియాలు,మెంతులు ఇవన్ని పెన్నములో ఒక స్పూన్ నూనె వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని చల్లారినాక మిక్సీలో వేసుకొని పక్కన్న పెట్టుకోవాలి .
- మల్లి కాస్త నూనె వేసుకొని పుదిన వేసుకొని సన్న మంట మీద వేయించుకోవాలి.
- పచ్చిమిరప కాయలు కూడా కాస్త నూనె వేసి వేయించుకొని పెట్టుకోవాలి.
తరువాత మొదట మిక్సీ లో వేసుకున్న పొడి లో వేయించుకున్న పుదిన ,పచ్చిమిరపకాయలు,బెల్లము చింతపండు,ఉప్పు,బెల్లము,తగినన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ వేసుకొని గిన్నలోకి తీసుకుంటే సరి ఎంతో రుచి కరమయిన పచ్చడి తయ్యార్............................
No comments:
Post a Comment