మష్రూమ్ ఫ్రైడ్ రైస్
రోజు కూరలతో అన్నము తినాలి అంటే విసుగు వస్తుంది అందుకే అప్పుడు అప్పుడు ఇలా రైస్ ఐటOస్ చేసుకోవచ్చు .
- మష్రూమస్స్ - 20 {or}కావలిసినన్ని
- పచ్చిమిరపకాయలు - 5
- ఉల్లికాడలు - ఒక కప్పు
- ఉప్పు - తగినంత
- సోయా సాస్ - 1 tsp
- అజిన మొటో - 1/2 tsp {వేయకున్న పరవాలేదు}
- నూనె - 6 tsp
- బాసుమతి రైస్ - 1 glass
- ఉల్లి గడ్డలు - 2 చిన్నవి
- మొదట బాసుమతి బియ్యము కడిగి ఒక అరగంట నాన బెట్టుకోవాలి తరువాత పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని ఎసరు కగినాక నాన బెట్టుకున్న బియ్యము వేసుకొని ఒక పది నిముషముల తరువాత నీరు వంచుకొని పక్కన పెట్టుకోవాలి .
- మష్ రూమ్ స్స్ బాగా కడుగుకొని ముక్కల్లు గ చేసుకొని పక్కన పెట్టుకోవాలి .
- ఉల్లిగడ్డలు సన్నగా ముక్కలు గ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- పచ్చి మిరపకాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి .
- పొయ్యి ముట్టించి నూనె వేసుకొని కగినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి కాస్త వేగినాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగినాక మష్ రూమ్ ముక్కలు వేసుకొని ,వుల్లికదల ముక్కలు వేసుకొని మధ్యస్తపు మంట మీద మధ్య మధ్య కలుపుతూ వుండాలి మూత మాత్రము మూయకూడదు [ఎందుకంటె నీరు ఊరుతుంది కాబట్టి]
- మష్ రూమ్స్ మగ్గినాక తగినంత ఉప్పు ఉడక బెట్టుకున్న అన్నము వేసుకొని కలుపుకోవాలి చివరికి సోయా సాస్ వేసి బాగా కలుపుకొని మగ్గ బెట్టుకొని వేడి వేడిగా నే దించుకోవాలి .
[అజిన మొటో వాడకూడదు అని అంటారు కాబట్టి నేను వాడను కావాలి అంటే మీరు వాడవచ్చు మాష్ రూమ్స్ మగ్గినాక దంచుకొని వేసుకోవాలి 1/2 tsp అంతే]
No comments:
Post a Comment