స్నాక్ ఐటెం చాలా బాగుంటాయి చిన్నపిల్లల్లు కూడా తినవచ్చు చాలా సులభము చేసి చూడండి.
అన్నము ఒకొక్కసారి చాలా మిగులుతుంది అప్పుడు ఇలా చేసి పెట్టుకొని కావలిసినప్పుడు వేయించుకోవచ్చు .
కావలిసిన పదార్థములు -
- అన్నము - యెంత మిగులుతే అంత [ఒక గిన్న]
- ఉప్పు - 1/4 tsp
- కాస్త నీరు
- ఒక పెద్ద బట్ట [పాత పంచ లేక లుంగి]
మిగిలి న చల్ల అన్నము లో ఉప్పు ,ఒక పావు కప్ నీరు పోసి అన్నము గడ్డలు లేకుండా కలుపుకొని [ఉప్పు అన్నము అంత పట్టే లాగా అన్న మాట అలా అని అన్నము పిసక కూడదు పొడి పొడి గ వుండాలి]ఒక పంచ పరుచుకొని ఈ అన్నము చల్లుకోవాలి [ఒక మెతుకు ఇంకొక మెతుకు అంటుకోకూడదు]ఒక రెండు రోజులు ఆర బెట్టుకోవాలి అవి డబ్బాలో వేసి పెట్టుకుంటే సరి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వేయించుకోవచ్చు .
ఎండి న తరువాత అన్నము బియ్యము ఇలా వుంటాయి .
ఇప్పుడు బొరుగులు ఎలా చేసుకోవాలో చూద్దము సరేనా
కావలిసిన పదార్థములు -
- చనక్కాయలు - ఒక కప్
- పుట్న్నలు - [పప్పులు]- అర్ధము కప్
- ఉప్పు - తగినంత [ఎండి న అన్నము బియ్యము లోకూడా వుంటుంది కాబట్టి చూసి వేసుకోండి]
- ఒట్టి కారము - తగినంత
- కరివేపాకు -ఒక పది ఆకులు
- పసుపు - కాస్త
- నూనె - ఒక రెండు కప్స్
మొదట పొయ్యి మీద పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక ఇటువంటి జాలి గంటె తీసుకోవాలి
ఈ గంటె లోనే పప్పులు,చ్చానక్కాయలు అన్ని విడి విడిగా వేసి గంటె ను నూనె లో అలా ముచుటే వేగు తాయి అలా వేగిన వాటిని పక్కలో పేపర్ పరిచిన ప్లతే లో వేసు కోవాలి .
తరువాత కాస్త కాస్త అన్నము బియ్యము ఈ జాలి గంట లో వేసుకొని నూనె లో ముంచి వేగినాక
[ఒక రెండు నిముషాలలో వేగుతుంది]వేయించుకున్న చేన్నక్కాయలు వేసుకున్న పేపర్ లో వేసుకోవాలి
తరువాత కాస్త పసుపు,ఉప్పు,కారము అన్ని వేసుకొని బాగా కలుపుకొని [మెత్తగా పిసకవద్దు]డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే సరి అన్నము బొరుగులు తయ్యార్ .............
No comments:
Post a Comment