Top Food Blogs

Thursday, November 24, 2011

MENTHI KUDUMULU

మెంతి కుడుములు = ఇది ఒక టిఫిన్ లాగ తినవచ్చు .ఇది ఒక పాత కాలపు వంట .మా నానమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను మా ఇంట్లో అందరికి చాలా ఇష్టము ,మీకు కూడ చెపుదామని అనుకుంటున్నాను .
కావలిసిన వస్తువులు = 

  1. గోధుమ పిండి - ఒక గ్లాస్ 
  2. ఒక స్పూన్ నూనె 
  3. ఉప్పు - తగినంత 
  4. మెంతి కూర - 5 కట్టలు 
  5. ఉప్పు - తగినంత
  6. ఒట్టి కారము - తగినంత 
  7. నూనె - తిరవాత వేసుకోవడానికి 
  8. తిరవాత గింజలు - మినప బేడలు,ఆవాలు,జీలకర్ర 
  9. ఎల్లిపాయలు - ఒక రెండు గడ్డలు 
తాయారు చేసుకునే పద్ధతి = 


మొదట  గోధుమపిండి ,ఒక స్పూన్ నూనె,ఉప్పు వేసి చపాతీ పిండి లా  తడుపుకొని చిన్న చిన్న వుల్లెల్లు చేసుకొని గుండ్రముగా చేసుకోవాలి ఇలా ......


తరువాత  ఒక  గిన్నలో నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని మూత  పెట్టండి ,నీళ్ళు  ఉడుకు పట్టినాక మూత తీసి తాయారు చేసుకున్న గోధుమ కుడుములు [అంటే పిండి తో చేసుకున్న చిన్న చిన్న వుంటలు అన్న మాట]ఉడుకుతున్న నీటిలో వేసుకొని 




ఒక అయ్దు నుంచి పది నిముషములు వుంచుకొని పొయ్యి బద్ చేసుకోవాలి ,తరువాత బొర్రల గిన్న లో వంచుకొంటే నీరు అంత పొయ్యి కుడుములు వుంటాయి  


ఇప్పుడు  తాలింపు వేసుకుందాము ,

  • మొదట ఎల్లిపాయలు పోట్టుతీసుకొని పెట్టుకోవాలి 
  • మెంతి కూర వలుచుకొని కడిగి రెండు సార్లు కడిగి బొర్రల గిన్నలో వేసుకోవాలి .
ఒక గిన్న తీసుకొని నూనె ఒక మూడు స్పూన్లు నూనె వేసుకొని కాగినాక ఎల్లిపాయలు ,




తిరవాత వేసుకొని మెంతి కూర వేసుకొని 
బాగా వేయించుకొని ,
తరువాత ఉప్పు,కారము వేసి బాగా కలుపుకొని ఉడక బెట్టి నీరు వంచుకున్న కుడుములు వేసుకొని బాగా కలుపుకొని ఒక అయిదు నిముషములు బాగా కలుపుకొని వేడి వేడిగా తినాలి అంతే ఎంతో రుచికరమయిన మెంతి కుడు ములు తయ్యార్ ...........................
ఇది షుగర్ వాళ్ళకి రాత్రి పూట టిఫిన్ తినే వాళ్ళకి ఒక వేరయిటీగ  వుంటుంది చేసి చూడండి.

No comments:

Post a Comment