పెట్ల వంకాయ కూర = ఈ కూర అన్నములోకి చాలా బాగుంటుంది తయారుచేయడము కూడా చాలా సులబము .
కూరకు కావలిసిన పదార్థములు =
- సన్నవి లేతవి వంకాయలు - 1/4 kg
- ఎర్ర కారము - 3 tsp
- ఉప్పు - 1 tsp [ సరిపడ ]
- ఎల్లిపాయలు - 5 పాయలు
- ఒట్టి కొబ్బెర - తురుముకున్న కొబ్బెర [3 tsp]
- నూనె - 9 tsp
మొదట వంకాయలు బొడ్లు తీసుకొని చాకుతో సన్నగా గాట్లు పెట్టండి ,తరువాత పెన్నము తీసుకొని పొయ్యి మీద పెట్టి నూనె
వేసుకొని కాగినాక వంకాయలు వేసుకొని కలుపుతూ వుండండి ఒక 5 mint's తరువాత మధ్యస్థం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి ,మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి అప్పుడప్పుడు ...................
వంకాయలు బాగా మగ్గినాక నూనె ఎక్కువ వుంటే తీసుకొని తయారు చేసుకున్న కారము వేసుకొని రెండు నిముషాలు బాగా కలుపుకొని దించుకొని ఆరగించావలెను.....
వంకాయలు బాగా మగ్గినాక నూనె ఎక్కువ వుంటే తీసుకొని తయారు చేసుకున్న కారము వేసుకొని రెండు నిముషాలు బాగా కలుపుకొని దించుకొని ఆరగించావలెను.....
కారము తయారుకు ఉప్పు,ఒట్టి కారము,ఒట్టి కొబ్బెర,ఎల్లిపాయలు అన్ని కలిపి మిక్సీ లో వేసుకోవాలి అంతే కారము తయ్యార్ ...................
No comments:
Post a Comment