పాలక్ ఆలు కర్రీ : ఈ కర్రీ ఒక కర్నాటక వంట మసాల తక్కువగా తక్కువ కారము తో కమ్మగా రుచిగా వుంటుంది కచ్చితంగా చేసుకోండి .అవుతే చేసుకుందామా మరి .......
- పాలకూర - 5 కట్టలు
- ఉల్లి గడ్డలు - 3 పెద్దవి
- టమోటా పండ్లు - 3 మీడియమువి
- ఎల్లి పాయలు [తెల్ల గడ్డలు] - 5 పాయలు
- ధనియాల పొడి - 1/2 tsp
- జీలకర్ర పొడి - 1/2 tsp
- అల్లము - కాస్త
- ఉప్పు - తగినంత
- పచ్చిమిరపకాయలు - 2
- చనక్కాయలు [బుడ్డలు] - వేయించి పొట్టు తీసుకొని పొడి చేసినది : 2 tsp
- ఉర్లగడ్డలు - 2 [ సన్నగా తరుగుకొని నీటిలో వేసుకొని పెట్టుకోండి ]
- మొదట పాలకూర బాగా రెండు సార్లు కడిగి సన్నగా తరుగుకొని పెన్నములో నూనె వేసుకొని కాగినాక ఈ కట్ చేసుకున్న పాలకూర వేసుకొని బాగా వేయించుకొని [నీరు వేయకూడదు]తీసి పక్కన పెట్టుకోవాలి.
- తరువాత సన్నగా తరుగు కున్న ఉర్లగడ్డ ముక్కలు [ఉర్లగడ్డ ఫ్ర్య్ కి తరిగిన మాదిరి]పెన్నములో కాస్త నూనె వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- పక్కన ఇంకొక గిన్నలో కాస్త నూనె వేసి ఉల్లిగడ్డలు -21/4 మాత్రము ముక్కలు చేసుకొని,టమోటా ముక్కలు వేయించి చల్లారినాక మిక్సీ లో వేసుకొని తిప్పి [పేస్టు]చేసుకొని పెట్టుకోవాలి.
- బుడ్డలు వేయించి పొట్టు తీసుకొని మిక్సీ లో పొడి చేసుకొని పెట్టుకోవాలి .
- అల్లము వెల్లుల్లి దంచుకొని పెట్టుకోవాలి .
- పచ్చిమిర్చి,ఉప్పు కలిపి పేస్టు చేసి పెట్టుకోవాలి.
- మిగిలిన అర్ధము ఉల్లిగడ్డ సన్నగా తరుగుకొని పెట్టాలి.
పొయ్యి ముట్టించి బాణలి [kadai] పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ వేసి వేయించుకొని అల్లము వెల్లుల్లి పేస్టు వేసి ఒక 5 mints వేయించుకొని ఉల్లిగడ్డ పేస్టు వేసి మల్ల ఒక 5mints వేయించుకొని టమోటా పేస్టు,పచ్చిమిరపకాయ పేస్టు,ధనియాల పొడి, జీలకర్ర పొడి,కాస్త పసుపు వేసి బాగా వేయించుకోవాలి కాస్త నూనె బయిటికి వచ్చే వరకు [తక్కువ నూనె వేస్తె రాదు కానీ బగ్గా దగ్గర కు వస్తుంది]వేయించుకోవాలి తరువాత వేయింతి పెట్టుకున్న పాలకూర,ఉర్లగడ్డ ముక్కలు వేసి కలిపి చివరికి చనక్కాయల పొడి వేసి బాగా కలిపి దించు కోవాలి, అంతే ఏoతో రుచికరము అయిన కూర తయ్యార్ అవుతుంది చేసి చూడండి.
No comments:
Post a Comment