దాల్ ఫ్రయ్ = ఇది ఒక సులభమయిన కూర ఒక పావు గంట లో చేసు కోవచ్చు .
- కంది పప్పు - 1/4 cup
- పెసర పప్పు - 1/4 cup
- నెయ్యి (or) వెన్న - 1/2 tsp
- పచ్చిమిరపకాయ - 2
- ఒట్టి కారము - 1/4 tsp
- ఉప్పు - తగినంత
- ధనియాలపొడి - చిటికెడు
- జీలకర్ర పొడి - చిటికెడు
- గరం మసాల - చిటికెడు
- కొత్తిమీర - కాస్త
- నిమ్మకాయ - 1/4 tsp
- ఉల్లిగడ్డ - 1 [సన్నగా ముక్కలు చేసుకోవాలి]
- టమోటా పండు - 1 చిన్నది [hybrid, సన్నగా కట్ చేసుకోవాలి]
- మొదట రెండు రకాల బేడలు కుక్కర్ లో వేసుకొని కడిగి తగినంత నీరు పోసి ఒక మూడు నుంచి నాలుగు విసిల్లు రానియ్యాలి .
- పెన్నము లో వెన్న వేసుకొని కరిగినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కాస్త వేగినాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త వేయించుకొని తరువాత ధనియాల జీలకర్ర పొడి , పసుపు వేసి వేయించుకొని టమోటా ముక్కలు,ఒక నాలుగు అల్లము ముక్కలు వేసి ఒక నిముషము తరువాత ఒక అర గ్లాస్ నీరు పోసుకొని కాస్త టమోటా ముక్కలు మగ్గినాక ఉడక బెట్టుకున్న బేడలు వేసుకొని ఒక నిముషము తరువాత ఉప్పు ఒట్టి కారము వేసి బాగా కలుపుకొని చివరికి గరం మసాల వేసుకొని తరువాత కస్తూరి మెంతి వేసి బాగా కలుపు కొని దించుకోవాలి చివరికి కొత్తిమీర వేసుకొని కలుపుకొని చివరికి నిమ్మరసము వేసుకొని దించుకోవాలి .................
No comments:
Post a Comment