Top Food Blogs

Friday, September 16, 2011

PANNER JILEBI [ SWEET ]


పన్నీర్  జిలేబి - 
కావలిసిన పదార్థములు -
                       పన్నీర్ - 1 cup 
                       మైదా - 1/2 cup 
                       బేకింగ్ పౌడర్ - 1/2 tsp 
                       నూనే - వేయించు కోవడానికి 
                       చెక్కర - పాకానికి [ 2 cups ]
                      రోజ్ ఎస్సెన్సు - కాస్త [రెండు చుక్కలు]
                      యాలకల పొడి - 1/4 tsp 
తయారు చేసుకునే పధ్ధతి -
మొదట  పన్నీర్  ఒక  గిన్నలో  గోరువెచ్చటి  నీటిలో పది  నిముషాలు వుంచి  ప్లేట్లోకి  తీసుకొని  బాగా  నలుపుకోవాలి [పిసుక్కో వాలి] ఎంత  బాగా  పిసుకుంటే  అంత  బాగా  వస్తాయి [ఒక  అయిదు నిముషాలు పిసకండి]

దానిలో  బకింగ్ పౌడర్ వేసి  కలిపి, మైదా వేసి  కలపండి 
[జామున్  పిండి లా వుండాలి పన్నీర్  జిలేబి పిండి  {చపాతీ  పిండి కంటే కాస్త (జోరుగా) మెత్తగా అన్నమాట}]

పాకము తయారు - పక్కన  స్టవ్  మీద చెక్కర  తీసుకొని 
1/2 cup నీళ్ళు  పోసి  సన్న  మంట  మీద  వుంచి  కలుపుతూ  వుండాలి  చెక్కర  కరిగి  తీగ  పాకము రావాలి
[ పాకము ఉడుకు తున్నప్పుడు ఒక్క 9 mints తరువాత 
 గంటె  తో ఉడుకు తున్న  నీరు  గిన్నలోకి దారగా పోస్తే తీగ వస్తది అప్పుడు స్టవ్  బంద్ చేసుకోండి ] అలా చేసుకున్న పకములో  యాలకల  పొడి  రోజ్  ఎస్సెన్సు  వేసి  కలుపుకొని  పక్కన  పెట్టుకోవాలి .

జిలేబి  తయ్యారు విధానము 

స్టవ్  మీద  పెన్నములో  నూనె  పోసుకొని  కగినాక  మొదట  తయ్యారు  చేసుకున్న  జిలేబి  పిండి  చిన్న చిన్న  చుట్టాల  మాదిరి  చేసుకొని  మీడియం  మంట  మీద  బంగారు  వర్ణములోకి [ రంగులోకి ] మారిన వెంటనే  తీసి  పాకములో  వేసుకొని  ఒక  5 నుంచి 10 నిముషాలు  వుంచుకొని  ఒక  గిన్నలోకి  తీసు  కోవాలి  అంతే  జేలబి  తయ్యార్ ...............

మనము  కూడ  ఇంట్లో  జేలబి  తయ్యారు  చేసు  కోవచ్చు చాల  సులబంగా  రుచిగా  తొందరగా  చేసి   చూడండి .

No comments:

Post a Comment