Top Food Blogs

Wednesday, July 27, 2011

MASALA BORUGULU [MARAMARALU] SNACK ITEM

కావలిసిన  పదార్థములు : 
  •  మరమరాలు- కరకర లాడుతూ వుండాలి[FRESH వి అన్నమాట] 
  • ఒట్టి కారము - 1/2 tsp 
  • ఉప్పు - 1/4 tsp 
  • పప్పులు - 1/2 కప్ [చిన్నది]{పుటానలు}
  • బుడ్డలు [వేరుశనగ గుండ్లు]- 1/2 కప్ 
  • ఒట్టి  మిరపకాయలు - 4 
  • తిరవాత గింజలు - 3 tsp[ఆవాలు,జీలకర్ర,శనగబేడలు,    మినపబేడలు,కరివేపాకు]
  • నూనె - 4 tsp 
తయారుచేసుకునే  పద్ధతి -


మొదట  బొరుగులు  శుబ్రము చేసి పెట్టుకోవాలి [అంటే నలుపులు అవి లేకుండా అన్నమాట]

తిరవాత  వేసుకోవడానికి  పెద్ద పెన్నము [లేక] బాణలి  తీసుకోవాలి ,దానిలో నూనె  వేసుకొని  కగినాక తిరవతగింజలు వేసి  ఒకనిముషము తరువాత వేరుశానగగుండ్లు,పుటానీలు,వేసి కలుపుకోవాలి అవి వేగుతూ వునప్పుడే  ఒట్టి మిరపకాయలు విరిచి [తుంచి]వేసుకొని పసుపు,కారము,ఉప్పు,జీర పొడి,ధనియాల పొడి  వేసి కలుపుకొని మర మరాలు  వేసుకొని బాగా కలుపుకొని  ఒక్క పది నిముషాలు  శగ  మీద  పెట్టుకొని  [మద్య మద్య లో  కలుపుతూ వునాలి అంతే మరమరాలు తయ్యార్ .........

ఈ  బొరుగులు  గాలి  ఆడని  డబ్బాలో పెట్టు కుంటే  పది రోజులు వరకు వుంటాయి .
కావాలి అంటే కొన్ని మసాల బొరుగులు  ఒక చిన్న గిన్నలోకి తీసుకుని సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ టమోటాముక్కలు   వేసుకొని  తగినంత నిమ్మ రసం వేసి కలుపుకొని తినవచ్చు .......

No comments:

Post a Comment