చపాతీలు ఉదయము చేసినవి మిగులుతే సాయంకాలము పిల్లల్కి ఈ విదముగా రోల్స్ లా చేసిపెట్టండి చాలాబాగుంటాయి .
కావలిసిన పదార్థములు -
>> కాబూలి చెన్న - ముందురోజు నానబెట్టుకోవాలి [లేక 8 గంటలు కాస్త సోలాపొడి వేసి వెచ్చటి నీటిలో నాన బెట్టుకుంటే సరి] ఒక 2 కప్పులు
>> పన్నీరు - తురుము కున్నది [ఒక కప్పు]
>> కారట్ తురుము - ఒక కప్పు
>> క్యాబేజు తురుము - ఒక కప్పు
>> ఉల్లిగడ్డ తురుము - ఒక కప్పు
>> టమోటా సాసు - ఒక కప్పు [చపాతీ కి పుయటానికి{spreading}]
>> పచ్చిమిరపకాయలు - సన్నగా ముక్కలు చేసుకున్నవి
>> ఉప్పు - తగినంత
>> అల్లము తురుము - కాస్త
>> ఒట్టి కారము - కాస్త
తాయారు చేసుకునే పద్ధతి : మొదట చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి (లేక) వున్నవి వాడుకోవచ్చు .
తరువాత కబాబ్స్ చేసుకునే పద్ధతి - ఒక గిన్నలో కాబూలి చెన్న పేస్టు ,
పుదినా ఉప్పు కలిపి దంచుకున్న పేస్టు,పన్నీర్ తురుము,కారము,పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు చేసుకున్నవి,
అల్లము పేస్టు,అన్ని వేసుకొని కబాబ్స్ మాదిరి [అంటే గులబ్జమున్ల మాదిరి అన్న మాట]
పెయిన చూపించిన మాదిరి అన్న మాట అల చేసుకున్న వాటిని ఒక తవ్వ మీద నూనే వేసి ఒక్క 5 mints వుంచి పక్కన పెట్టు కోవాలి .
తరువాత చప్పాతి మీద టమోటా సాస్ పూసి ఈ కబాబ్ ఒక చివర పెట్టి దానిమీద అన్ని తురుములు వేసుకొని కావాలి అంటే చీజ్జ్ తురుము వేసుకొని నిదానముగా చుట్టుకోవాలి అంతే చెన్న పన్నీర్ రోల్ తయ్యార్ .........
No comments:
Post a Comment