Top Food Blogs

Friday, July 22, 2011

KAKARAKAYA TIYYA KURA

కావలిసిన పదార్థములు - 
>> కాకర కాయలు - 2 
>> కందిబేడలు - ఒక  చిన్న కప్పు 
>> ఉప్పు - రుచికి తగినంత [ 1/2 tsp ]
>> ఒట్టి కారము - తగినంత  [ 3/4 tsp ]
>> బెల్లము - తగినంత [ 1/2 అచ్చు ]
>> పసుపు - చిటికెడు 
>> చింతపండు  గుజ్జు - 2 tsp 
>> ఉల్లిగడ్డ - 1 
>> నూనె - 4 tsp 
>> తిరవాత గింజలు - 1/2 tsp 

తాయారు చేసుకునేపద్దతి - మొదట  కందిబేడలు పలుకుగా [అంటే 
మెత్తగా కాకుండా] ఉడకబెట్టుకోవాలి.

కాకరకాయలు  గుండ్రంగా ముక్కలు చేసుకొని  నీళ్ళలో వేసుకొని కాస్త ఉప్పు,
చింతపండు,పసుపు వేసి ఉడకబెట్టుకొని నీటిని  వంచుకోవాలి .

బాణలి  పెట్టుకొని  నూనె వేసుకొని తిరవతగింజలు,కరివేపాకు వేసి వేగినాక 
ఉల్లిగడ్డలు  వేసుకొని కాస్త మగ్గినాక  ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు 
వేసి రెండు నిముషాలు మగ్గబెట్టి చింతపండు గుజ్జు,ఉప్పు,కారము,బెల్లము,
అన్ని వేసి కలిపి మగ్గబెట్టి చివరికి ఉడకబెట్టిన కందిబేడలు వేసి బాగాకలిపి  
ఒక అయిదు నిముషాలు మగ్గబెట్టి దించాలి అంతే  కాకరకాయ తియ్య కూర
తినడానికి  తయ్యార్ .

ఈ  కూర  అన్నములోకి  చాలా బాగుంటుంది  చేసుకొని  చూడండి................

No comments:

Post a Comment