కావలిసిన పదార్థములు -
కందిబేడలు - 1 కప్పు
పచ్చిమిరపకాయలు - 6
వంకాయ - 1
కసూరి మెంతి(ఎండబెట్టిన మెంతి ఆకు)-1 కట్ట
ఉల్లిగడ్డ - 1
పసుపు - చిటికెడు
చింతపండు - కాస్త (ఉసిరికాయ అంత)
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 tsp
తిరవాత గింజలు - (ఆవాలు,మినపబేడలు,జిలకర)
తాయారు చేసుకునే పద్ధతి -
మొదట చింతపండు కడిగి నీళ్ళలో నన బెట్టుకోవాలి .
మొదట కందిబేడలు కడిగి ఒకటికి రెండు లాగా నీళ్ళు వేసుకొని వంకాయ,ఉల్లిగడ్డ,పచ్చిమిరపకాయలు అన్ని ముక్కలుగా చేసుకొని కడిగిన
కందిబెడలల్లో వేసుకోవాలి తరువాత కాస్త పసుపు కసూరి మెంతి వేసి కుక్కర్ర్
మూత మూసి రెండు విసిల్లు రానిచ్చి దించుకోవాలి,
విసిల్లు వచ్చినాక మూత తీసి మొదటే నానబెట్టుకున్న చింత పండు గుజ్జు
తగినంత ఉప్పు వేసుకొని ఎనుపుకోవాలి ( పప్పుగుత్తితో కానీ మందపాటి గరిటతో కానీ బాగా కలుపుకోవాలి ) ఉప్పు చింతపండు మిరపకాయలు అన్ని
బాగా కలిసేలాగా మేడుపుకోవాలి .
తరవాత చిన్నపెంనము పెట్టుకొని నునే వేసుకొని కావాలి అంటే
(ఏల్లిపాయలు) వేసి కాసేపు వున్నాక తిరవత గింజలు వేకొని వేగినాక
కరిపాకు వేసి స్టవ్ బంద్ చేసుకొని పోపు పప్పులో వేసు కొని మూత పెట్టుకుంటే సరి
ఇది అన్నము లోకి తపిలెంటు లోకి పుల్కలోకి బాగుంటుంది .
No comments:
Post a Comment