మట్టికాయ పులుసు కూర -
కావలిసిన పదార్థములు -
మట్టికాయలు -1/4 kg
పచ్చిమిరపకాయలు - 4
ఉల్లిగడ్డ - 1
ఒట్టికారము - 1/4 tsp
ఉప్పు - తగినంత
చింతపండు పులుసు - తగినంత [ 1/2 tsp ]
చెక్కర - 1/4 tsp
పసుపు - 1/4 tsp
నూనె - 1/4 tsp
తిరవాత గింజలు - ఆవాలు,మినప బేడలు,జీలకర్ర
పచ్చి కొబ్బెర - 3 tsp
తయారు చేసుకునే విధానము - మొదట మట్టికాయలు
సన్నగా వలుచుకొని పసుపు వేసుకొని నీళ్ళు పోసుకొని
వుడికిన్చుకొని వంచుకొని పక్కన పెట్టుకోవాలి.
తరవాత ఒక చెమ్చ నూనె వేసుకొని తిరవాత వేసుకొని
ఉల్లిగడ్డలు,పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గినాక ఒక
గ్లాస్ నీళ్ళు వేసి ఒక 5 mints మగ్గినాక దానిలో
చిoతపండు పులుసు,ఒట్టికారము,ఉప్పు,చెక్కర ఉడకబెట్టుకున్న మట్టికాయలు మల్ల ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకొని కాస్త ఎనుపుకొని [ పెద్ద గంటె తో కాస్త నలిపుకొని వడ్డిన్చుకోవాలి] అన్నములో కలుపుకొని తినాలి .
No comments:
Post a Comment