Top Food Blogs

Tuesday, March 22, 2011

VAADAPPALU [ TIFFEN ITEM ]


వాడప్పలు : 



వాడప్పలు  ఇవి  ఎంతో రుచికరమయినవి  ఆరోగ్య కరమయినవి  కూడా 
ఎందుకంటె  ఇవి  జొన్న,గోధుమ,శనగ  పిండి  ఈ  మూడిoటి  తో  కలిపి  చేస్తారు  కాబట్టి .

వాడప్పల తయారు కి  కావలసినవి :
  • జొన్న పిండి - 1 గ్లాస్  
  • గోధుమ పిoడి  - 1/4  గ్లాస్   
  • శనగపిండి - 1/4 గ్లాస్ 
  • నూగులు - 1/4 tsp 
  • జీలకర్ర - 1/4 tsp 
  • ఉప్పు - తగినంత 
  • నునె - పూరిలను  కాల్చుకోవడానికి  సరిపడా 
  • వీడి నీళ్ళు - ఒక చిన్న గ్లాస్ 
తాయారు  చేసుకునే  పద్దతి : 
మొదట  కాస్త  నీళ్ళు  పొయ్యి  మీద  పెట్టి  కాన్చు కోవాలి .
తరువాత  ఒక  పళ్ళెములో  జొన్న పిండి ,గోధుమ పిండి,శనగ పిండి ,ఉప్పు,
నూగులు  అన్నివేసుకొని  

 బాగా కలుపుకొని  కాoచు కున్న  వేడి  నీరు  పోసుకొని  కింద బొమ్మలో చుయించిన మాదిరి  
[సరిపడా,{అంటే చపాతీ పిండి అంట గట్టిగ పిండి తడుపుకోవాలి అన్నమాట}]



తరువాత   చిన్న  చిన్న  ఉంటలు[ఉల్లెలు]చేసుకొని  ప్లాస్టిక్  పేపర్  మీద కాస్త నూనె పూసి ఉల్లే  పెట్టుకోవాలి  ఇలా [నూనె  పూస్తు ఉల్లే  పెట్టుకొని వత్తుకోవాలి అప్పుడు  పేపర్ కి అంటుకోకుండా  వస్తాయి ] 
ఒక పక్కన పెన్నములో  నూనె  పోసుకొని  పొయ్యి  మీద  పెట్టుకోవాలి .
  
తరువాత  చేతితో  వత్తుకోవాలి   ఇలా

 పూరీ  నిదానంగా  చేతికి  తీసుకొని  పక్కన  పొయ్యిమీద  కాగుతున్న నూనె 
లో  వేసి  కాల్చు కుంటే  సరి  ఎంతో రుచి కరమయిన  వాడప్పలు  తయ్యార్ ..

వాడప్పల తో నంచుకోవడానికి  చట్నీ :  

వాడప్పలకు   నంచు కోవడానికి  చట్నీ ఉల్లిగడ్డల  కారము  అయితేనే  బాగుంటుంది  కావాలి  అంటే  చేసి  తినాలి  ఏమి  అంటారు  నేర్చు కుందమా..

కారము  కు  కావలిసిన  పదార్తములు :

  • ఉల్లిగడ్డలు - 5  [చిన్నవి]
  • చింతపండు - గోరిస [కాస్త]
  • ఉప్పు - సరిపడ
  • ఒట్టి మిరపకాయలు - 8 
  • బెల్లము - 1/2 tsp 
  • ఒట్టి కొబ్బెర - 1/2 tsp 
 తాయారు పద్దతి : 

పైన  చెప్పినవన్నీ  మిక్సీ లో  వేసుకొని  తిప్పుకొని  గిన్నలో  తీసుకొని  వడ్డించు కుంటే  సరి వాడప్పలు ఎర్రకారం  తయ్యార్ ...









































    No comments:

    Post a Comment