గోంగూర పచ్చడి :
ఈ పచ్చడి ఎంతో రుచికరమయినది, మరిఎంతో పురాతన రకము ది కూడా .
ఇది ఆంధ్రుల స్పెషల్ వంటకము. అయితే కొన్ని చోట్ల చేస్తారు కొన్ని దెగ్గర చేయరు అంతే. ఒకొక్క ఇంట్లో ఒకొక్క తరహ లో చేస్తాతారు , అయితే మా ఇంటి లో ఎలా చేస్తారో ఇప్పుడు చెప్పుతాను ,ఒక రకము ది చేసి చూడండి....
పచ్చడి చేయుటకు కావలిసిన పదార్తములు :
- గోంగూర - 2 కట్టలు
- పచ్చి మిరపకాయలు - 9
- ధనియాలు - 1 tsp
- ఉల్లిగడ్డలు - 2
- నూనె - 4 tsp
- చనక్కాయలు - 3 tsp
మొదట బాణలిలో నూనె వేసుకొని ఉల్లిగడ్డలు వేయించుకొని పక్కన
పెట్టుకోవాలి .
మల్ల కాస్త నూనె వేసుకొని ధనియాలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని తరువాత గోంగూర బాగా కడుక్కొని వేసుకోవాలి
[కింది కాడలు లేకుండా ఉత్త ఆకులు మాత్రమూ వలుచు కోవాలి ,తరువాత
బాగా నీళ్ళు పోసుకొని రెండు సార్లు కడుగుకోవాలి]కాస్త చిన్న మంట
పెట్టుకొని కలుపుతూ వుండాలి అంతే ఆకు మగ్గి దగ్గరకు వస్తుంది,అప్పుడు
దించుకోవాలి .
చల్లారినాక మొదట మిక్సీ లో [వేయించుకున్న పోట్టుతీసుకున్న చనక్కాయలు] చనక్కాయలు,ఉప్పు వేసి తిప్పుకొని తరువాత మగ్గబెట్టుకున్న గోంగూర వేసి తిప్పుకొని [మరీ పేస్టు చేయకండి ]మొదట వేయించుకున్న ఉల్లిగడ్డల గిన్నలో తీసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి
అంతే పచ్చడి తయార్ ...........................
No comments:
Post a Comment