Top Food Blogs

Thursday, March 24, 2011

TYPES OF RASAM [ WITH OUT POWDER ]

రసం:   రసము ; దీనిని  చారు అని కూడా అనoటారు, చాలా  మంది కి  ఈ పదార్థము లేక పొతే  భోజనము  చేసినట్టు  వుండదు  తెలుసా ....................
                  అలాంటి  వాళ్ళ కోసము  కన్ని  రసం  రకాలు  తెలుసు కుండము ......................


1 . మొదటి రకము :

కావలిసిన పదార్తములు -
  • అల్లము - కాస్త 
  • మిరియాలు - 10 
  • జీలకర్ర - 3/4 tsp 
  • కొత్తిమీర - కాస్త 
  • కరివేపాకు - ఒక రెబ్బ 
  • ఉప్పు - సరిపడా 
  • పసుపు - 1/4 tsp 
  • టమోటా పండు - 1 
  • చింతపండు - గోరిస 
  • నీళ్ళు - 1 గ్లాస్
  • ఇంగువ - కాస్త 
  • ఎల్లిపాయలు - 3 
తాయారు చేయు పద్దతి :
మొదట  ఒక  గిన్నలో   నీళ్ళు  తీసుకొని  దానిలో  టమోటా  ముక్కలు,
చింతపండు,ఉప్పు,పసుపు,కాస్త  కరివేపాకు,ఇంగువ  వేసుకొని  పొయ్యి మీద పెట్టుకోవాలి.
పక్కన  చిన్న రోటిలో [లేకపోతే మిక్సీ లో] మిరియాలు,జీలకర్ర  దంచి వేసుకోవాలి ,తరువాత అల్లము,ఎల్లిపాయలు [కచ్చ పచ్చగా] దంచి వేసుకోవాలి. 
పక్కన  చిన్న పెన్నములో  1/4 tsp నూనె వేసుకొని  తిరవాత పెట్టుకొని 
మరుగుతున్న  రసంలో  వేసుకోవాలి. 
చివరికి కొత్తిమీర, కాస్త కరివేపాకు  వేసుకొని  ఒక్క  ఉడుకు  రానిచ్చి  దించుకోవాలి అంతే  రసం తయ్యార్ ..................

2 . రెండోవ రకము :

కావలిసిన పదార్తములు {జీలకర్ర  చారు } -
  • జీలకర్ర - 3 tsp 
  • ఉప్పు - రుచికి తగినంత 
  • చింతపండు - గోరిస 
  • పసుపు - 1/4 tsp 
  • ఉడకబెట్టిన  కందిపప్పు - ఒక చిన్న కుప్పు  
  • పచ్చి మిరపకాయలు - 4 [మధ్యకు చీల్చుకోవాలి ]
  • కరివేపాకు - రెమ్మ 
  • నూనె - 1/2 tsp 
  • తిరవాత గిoజలు - 1/2 tsp 
  • చెక్కర - 1/4 tsp 
  • కొత్తిమీర - కాస్త 
  • య్ల్లిపాయలు - 3 
తాయారు చేయు పద్దతి :
మొదట  బాణలి పెట్టుకొని నూనె  వేసుకొని  తిరవాత గింజలు వేసుకొని 
పచ్చి మిరపకాయలు  వేసుకొని రెండు నిముషాల తరువాత టమోటా ముక్కలు వేసి మగ్గినాక [మద్యస్త పు మంట పెట్టుకోవాలి] 
దంచుకున్న జీలకర్ర [no ready made powder ] ఎల్లిపాయల  పేస్టు వేసుకొని ఒక 
నిముషము కలుపుకొని నీళ్ళు వేసుకొని ఉప్పు,చింతపండు,పసుపు,చెక్కర 
అన్ని వేసుకొని  బాగా కలుపుకొని తరువాత  ఉడక బెట్టిన కంది పప్పు 
వేసుకొని  బాగా మరగాబెట్టుకొని లాస్టు దించుకునేటప్పుడు కొత్తిమీరా,కరివేపాకు వేసుకొని దించుకోవాలి ................

3 . మూడో రకం రసం :[ఉల్లికాడల రసం ]

కావలిసిన పదార్తము -
  • ఉప్పు - రుచికి సరి పడ
  • ఉల్లి కాడలు - 10 [SPRING ONION]
  • చింతపండు పులుసు - 2 tsp 
  • పచ్చిమిరపకాయలు - 4 [మధ్యకు చీల్చుకోవాలి ]
  • కొత్తిమీర - కాస్త 
  • జీలకర్ర - 1/2 tsp , ఎల్లిపాయలు - 3 [రెండు కలిపి పేస్తే చేసుకోవాలి]
  • ఎర్ర కారము - 1/4 tsp 
  • మెంతులు-1/4 tsp ,ధనియాలు- 1/4 tsp ,జీలకర్ర-1/4 tsp [అన్ని దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి ]
  • నూనె - 3  tsp 
తాయారు చేసే పద్దతి :
బాణలి తీసుకొని నూనె  వేసుకొని తిరవాత వేసుకోవాలి ఎల్లిపాయల పేస్టు 
వేసి పచ్చి మిరపకాయలు వేసి కాస్త వేయించుకొని ఉల్లికాడలు,ఉప్పు,చింతపండు పులుసు,ఎర్రకారము,పైన తాయారు చేసుకున్న పొడి ,కరివేపాకు,కొత్తిమీర అన్ని వేసుకొని బాగా మరగ బెట్టుకొని 
దించుకోవాలి . 

No comments:

Post a Comment