Top Food Blogs

Wednesday, March 23, 2011

GODUMA DOSA WITH PERGU,PAPPULAPODI CHUTNE

గోధుమ దోసలు :
  
గోధుమ దోసలకు  కావలిసిన  పదార్తములు -
  • గోధుమ  పిండి  - 1 గ్లాస్ 
  • బియ్యoపిండి - 1/4 గ్లాస్ 
  • జీలకర్ర - 1/4 tsp 
  • ఉప్పు - రుచికి  తగినంత 
  • నూనె - కాల్చుకోవడానికి
తాయారు  చేసుకునే  పద్దతి -
మొదట  గోధుమ పిండి,బియ్యం పిండి,ఉప్పు,జీలకర్ర అన్ని ఒక గిన్నలో 
తీసుకొని నీరు పోసి కలుపుకోవాలి ,ఇలా నీళ్ళ గా వుండాలి 
[కింద బొమ్మలో చూపించిన మాదిరి]

తరువాత  పొయ్యి మీద  పెన్నము పెట్టుకొని పెన్నము  బాగా కాలినాక  దోస 
వేసుకోవాలి  ఇలా ............

తరువాత  నూనె  వేసుకొని కాలినాక తిప్పుకొని , అటు పక్క కూడా కాలినాక   తీసుకోవాలి ,అంతే 
ఎంతో రుచికరమయిన  గోధుమ  దోసలు  తయ్యార్.........

ఇప్పుడు  దాని లోకి  చట్నీ [దీనికి ఈ చట్నీ అయితేనే బాగుంటుంది గోదుమ 
దోస కాస్త సప్పగా వుంటుంది కాబట్టి కాస్త కమ్మటి పుల్లుపుతో ఈ చట్నీ చాలా
బాగుంటుంది  చేసి తిని చెప్పండి ]

చట్నీ  కి  కావలిసిన  పదార్తములు  :
  • పుట్నాల పొడి [పప్పుల  పొడి (ఉత్తది )] - 2 కప్స్
  • పచ్చి మిరపకాయలు - 5 
  • పచ్చి కొబ్బెర [తురుము (or ) ముక్కలు] - 8 
  • ఉప్పు - రుచికి తగినంత 
  • పెరుగు - 1 1/2  కప్ 
  • కొత్తిమీర - కాస్త 
తాయారు  చేయు పద్దతి  :

1. మిక్సీ  లో  కొబ్బెర పచ్చిది,ఉప్పు  వేసి తిప్పుకోవాలి ; 
2. తరువాత  దీనిలోనే  పచ్చి మిరపకాయలు,కొత్తిమీర వేసి తిప్పి తరువాత ; 
3. ఈ (కచ్చ పచ్చగా)పేస్టు ను పెరుగు  ఉన్న గిన్నలో వేసుకొని  తరువాత  ;
4. పప్పుల పొడి  వేసి కలుపుకోవాలి , కావాలి అంటే నీళ్ళు కూడా వేసుకొని 
కలుపుకోవాలి ;
5. తరువాత  పక్కలో పెన్నము పెట్టుకొని  నూనె వేసుకొని  తిరువాత వేసుకొని చట్నీలో వేసుకుంటే  చట్నీ తయ్యార్ ...........................

ఇలా  గోదుమ  దోసలు  చట్నీ తో  తిని  ఆనందించండి ..............................


No comments:

Post a Comment