మెత్త ఇడ్లి :
ఇడ్లి కి కావలిసిన పదార్తములు :
ఉప్పుడు బియ్యము - 1 గ్లాస్
మామూలు బియ్యము - 1 గ్లాస్
అటుకులు - 1/2 గ్లాస్
మినపపప్పు - 1/2 గ్లాస్
పైన చెప్పినవన్నీ ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టిన
తరువాత రుబ్బి ఉప్పు సోలపొడి వేసి కలుపుకుంటే
పిండి తయ్యార్ , ఇంక ఇడ్లి పాత్రలో నూనే పూసి
ఇడ్లి వేసుకుంటే సరి ........................
ఇడ్లీ కి చట్నీలు :
కొత్తిమీర చట్ని : కొత్తిమీర - 1 రుపాయది [దండిగా,1 కప్]
[పప్పులు]పుట్నాల పప్పులు - 1/4 కప్
పచ్చిమిరపకాయలు - 4
ఉప్పు ,
పచ్చి కొబ్బెర ,
నిమ్మకాయ ,
పైన చెప్పినవన్నీ మిక్సీ లో వేసుకొని తిప్పుకొని గిన్నలో తీసుకోవాలి ,తరువాత నిమ్మ రసం[1/2 ఒప్ప] పిండుకోవాలి . తరువాత పెన్నము పెట్టి ...............
నునే ,
తిరవాత గింజలు:[మినపప్పు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,ఒట్టిమిరపకాయ]
............. వేసి వేగినాక చట్నిలో వేసుకోవాలి అంతే
మెత్త మెత్త ఇడ్లీ లో పుల్లగా ఈ చట్నీ బాగుంటుంది
ఇది ఇంకొక రకం చట్నీ ::::
టొమాట చట్నీ :::
కావలిసిన పదార్తములు :: టమోటాలు - 1/4 kg
ఒట్టి మిరపకాయలు - 7
ఉల్లిగడ్డలు - 4 [చిన్నవి]
ఉప్పు , నూనే - 3 tsp
బెల్లము [కాస్త;అది కావాలి అంటె]
మొదట బాణలి పెట్టి నూనే వేసి టమోటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు , ఒట్టి మిరపకాయలు వేసి మగ్గబెట్టుకోవాలి , చల్లారినాక ఉప్పు వేసి మిక్సీ లో వేసుకోవాలి అంతే చట్ని తయ్యార్ ............
No comments:
Post a Comment