Top Food Blogs

Tuesday, March 8, 2011

PUDINA RICE



పుదిన  రైస్ : ఎంతో  రుచి  కరమయిన  రైస్  , ఎప్పుడు ఒకే రకం రైస్ లాగా కాకుండా  ఇలా  వేరే  రకాలు  చేసుకోండి  ,చాలా  బాగుంటుంది ఇది  గ్యాస్  ట్రబుల్  వాళ్ళకి  ఎంతో మంచిది  పుదిన. 

కావలిసిన  పదార్తములు : 

          పుదిన  - 1 కట్ట 
          చెక్క - కాస్త 
          పసుపు - కాస్త 
          అల్లము - కాస్త 
           పచ్చి కొబ్బెర - 1/4 చిప్ప 
             పచ్చి మిరపకాయలు - 4 [కావలిసి నన్ని]

పైన  చెప్పినవన్నీ  మిక్సీ లో పేస్టు  చేసుకోవాలి 

అన్నము  తయారుకు  కావలిసినవి  :

  • అన్నము - 1 గ్లాస్ 
  • నిమ్మకాయ - 1
  •  ఉల్లిగడ్డలు  - 1- 2 
  •  ఉప్పు  - కావలిసినంత 
  •  నూనే - 8 TSP 

తయారు చేసుకునే  పద్దతి  :

మొదట  అన్నము చేసుకోవాలి . 

బాణలిలో  ఉల్లిగడ్డ ముక్కలు వేసి  వేయించి  తరువాత 

పైన తాయారు  చేసుకున్న పేస్టు వేసి సన్నటి  మంట 

మీద

వేయించి తరువాత అన్నము కావలిసినంత ఉప్పు వేసి 

కలిపి రెండు నిముషాలు మగ్గబెట్టి దించి నిమ్మరసం 

[సరిపడినంత] పిండి కలుపుకొని  వద్దిచు కొంటె సరి .......

కావాలి  అంటే పెరుగు రాయిత వేసుకోండి 

రాయిత : కమ్మటి  పెరుగులో  ఉల్లిగడ్డ ముక్కలు [సన్నగా 

తరిగినవి],దోసకయముక్కలు,ఉప్పు,ఒక్క మిరపకాయ  ముక్కలు  

కలుపుకోవాలి ..... 



No comments:

Post a Comment