చిత్రాన్నము
ఇది ఎంతో పాత కాలం వంట కానీ దీనిని ఎంతో మంది
ఎన్నో రకాలుగా చేసుకుంటారు .............
దీనిలో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు .......
కూరగాయలు వేసి ,
కూరగాయలు వేసుకోకుండా
నూగుల చిత్రాన్నము
చింతపండు పులుసు చిత్రాన్నము
పచ్చి బటాణీల చిత్రాన్నము ..................................
ఏ అన్నము రకము చేసుకోవాలి అన్న మొదట అన్నము చేసుకోవాలి
తరువాత ఎన్నిరకాలు అయిన చేసుకోవచ్చు కదా ........
[ 1 ]
కూరగాయల చిత్రాన్నము :
కావలిసిన పధర్థములు -
- వంకాయలు - 4
- ఉర్లగడ్డలు - 3
- నూనే - 10 tsp
- తిరవాత గింజలు ( శనగ,మినప బేడలు,ఆవాలు,జీలకర్ర,కరవేపకు,పసుపు)
- చేనక్కాయలు [ కావాలి అంటే ]
- పప్పులపొడి - 1 tsp
- పచ్చిమిరపకాయలు - 7
- ఉప్పు తగినంత
- కొత్తిమీర
- పచ్చి కొబ్బెర - 1/4 చిప్ప
- పసుపు - 1/4 tsp
తయారు చేసే పద్దతి :
(1) మొదట బాణలి తీసుకొని అన్నానికి సరిపడ నూనే వేసుకొని కాగినక తిరువాత గింజలు వేసి వేగినాకఉర్లగడ్డ ముక్కలు వేసి రెండు నిముషాల తరువాత వంకాయ ముక్కలు,పసుపు వేసి కలిపి మూతపెట్టాలి
[ రెండు నిముషాలు పెద్ద మoట పెట్టుకొని తరువాత సన్న మంట పెట్టుకొని మూత మూసుకొని మద్య మద్యలో కలుపుకోవాలి] ఒప్పలు మగ్గినతరువాత కింద చెప్పిన పచ్చికారము వేసి కాస్త మగ్గినాక
అన్నములో వేసుకోవాలి .
(2) [ పచ్చిమిరపకాయలు;ఉప్పు;పచ్చికోబెర్ర అన్ని కలిపి మిక్సీ లో వేసుకోవాలి .]
(3) అన్నములో నిమ్మకాయ రసం,పప్పుల పొడి-1tsp అన్ని వేసి కలుపు కోవాలి. అంతే చిత్రాన్నము తయ్యార్ ..............
[ 2 ]
కూరగాయలు లేకుండా ఒట్టి చిత్రాన్నము :
కావలిసిన పదార్తములు -
- నూనే - 6 tsp (or) అన్నముకు తగినంత
- తిరవాత గింజలు [ఆవాలు,జీలకర్ర,మినప,శనగబేడలు,శనక్కాయలు,పసుపు,కరివేపాకు]
- పచ్చి మిరపకాయ ముక్కలు - 5 (కారం కావలసినంత)
- నిమ్మరసం - 1 (అన్నముకు సరిపడ)
- పప్పులపొడి - కాస్త
తయారు చేసుకునే పద్దతి -
అన్నము పళ్ళెములో వేసి గడ్డలు లేకుండా విడి చేసుకోవాలి,
తరువాత పెన్నములో తగినంత నూనే వేసి [అన్నము రకాలకు కొంచము
నూనే పడుతుంది] కాగినాక తిరవాత గింజలు ,పసుపు అన్ని వేసి కలిపి
చివరికి చనక్కాయలు వేసి వేగినాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి రెండు
నిముషాల తరువాత దించి తగినంత ఉప్పు వేసి అన్నములో వేసుకొని,
చల్లరినాక తాజా కొత్తిమీర,నిమ్మరసం,పప్పులపొడి వేసి కలుపుకుంటే
చిత్రాన్నం తయార్....................
(3)
నూగుల చిత్రాన్నము :
కావలిసిన పదార్తములు :
- మెంతులు - 1/4 tsp (or) అంతకంటే తక్కువ వేసుకోవచ్చు అన్నము బట్టి
- నూగులు - 4 tsp
- మినపప్పు - 1 tsp
- ఒట్టి మిరపకాయలు - 8
- నూనే - 8 tsp (అన్నముకు తగినంత)
- తిరవాత గింజలు - 2 tsp
(ఆవాలు,జీలకర్ర,మినప,శనగ బేడలు,ఇంగువ,ఒక ఎండు మిరపకాయ)
తయారు చేసుకునే పద్దతి :
అన్నము పళ్ళెములో వేసి గడ్డలు లేకుండా విడి చేసుకోవాలి,
తరువాత పెన్నములో తగినంత నూనే వేసి [అన్నము రకాలకు కొంచము
నూనే పడుతుంది] కాగినాక తిరవాత గింజలు ,పసుపు,కరివేపాకు అన్ని
వేసి వేగినాక అన్నములో వేసి తాయారు చేసుకున్న నూగుల పొడి తగినంత ఉప్పు , నిమ్మరసం పిండు కుంటే నూగుల చిత్రాన్నం తయ్యార్ .......
సూచన : ఈ అన్నములో కూడా కావాలి అంటే తిరవాత వేసినాక ఒప్పలు
వేసుకొని మగ్గబెట్టుకోవచ్చు.
పొడి తయారు పద్దతి :
మినపప్పు,మెంతులు,నుగులు,ఒట్టిమిరపకాయలు అన్ని విడి విడి గ వేయించు కొని పొడి [మిక్సీ లో] చేసుకోవాలి .
గమనిక : బేడలు ఎర్రడాలు గా వేయించు కోవాలి ,
నుగులు పెద్ద మంట లో వేయించుకోవాలి [చిట పట మని అంటే చాలు వేగినట్టు లెక్క . వేగేటప్పుడు కలుపుతూ వుండండి లేకపోతే మదుతాయి]
(4)
చింతపండు పులుసు తో చిత్రాన్నము :
కావలిసిన పదార్తములు :
- చింతపండు గుజ్జు - 2 tsp (అన్నముకు సరిపడా)
- చనక్కాయలు - కొన్ని
- నూనే - 8 tsp
- పచ్చిమిరపకాయలు ,ఉప్పు,పసుపు
- తిరవాత గింజలు - 2 tsp
(ఆవాలు,జీలకర్ర,మినప,శనగ బేడలు,ఇంగువ,ఒక ఎండు మిరపకాయ)
తయారు చేసుకునే పద్దతి :
అన్నము పళ్ళెములో వేసి గడ్డలు లేకుండా విడి చేసుకోవాలి,
తరువాత పెన్నములో తగినంత నూనే వేసి [అన్నము రకాలకు కొంచము
నూనే పడుతుంది] కాగినాక తిరవాత గింజలు ,పసుపు,కరివేపాకు అన్ని
వేసి వేగినాక మిక్సీ లో వేసుకున్న పచ్చిమిరపకాయల కారము చింతపండు గుజ్జు వేసి ఒక ఐదు నిముషాలు సన్న మంట మీద మగ్గినాక దించి
అన్నములో వేసి కలుపు కొంటె చిత్రాన్నము తయ్యార్............................
(5)
పచ్చి బటాణీల చిత్రాన్నము :
కావలిసిన పదార్తములు :
- పచ్చి బటాణీలు - 1 కప్
- నూనే - 10 tsp
- తిరవతగింజలు ( శనగ,మినప బేడలు,ఆవాలు,జీలకర్ర,కరవేపకు,పసుపు)
- చేనక్కాయలు [ కావాలి అంటే ]
- పప్పులపొడి - 1 tsp
- పచ్చిమిరపకాయలు - 7
- ఉప్పు తగినంత
- కొత్తిమీర
- పచ్చి కొబ్బెర - 1/4 చిప్ప
- పసుపు - 1/4 tsp
తయారు చేసే పద్దతి :
(1) మొదట బాణలి తీసుకొని అన్నానికి సరిపడ నూనే వేసుకొని కాగినక తిరువాత గింజలు వేసి వేగినాక పచ్చి బటాణీలు వేసి ముతా పెట్టండి
లేకపోతే ఎగుర్తాయి రెండు నిముషాల తరువాత మూత తీసి పచ్చి మిరపకాయలు,ఉప్పు, కొబ్బెర ,కొత్తిమీర కలిపి మిక్సీ వేసుకున్న కారము వేసి మగ్గబెట్టి దించుకొని ,అన్నములో వేసుకోవాలి , దీని జతలో పప్పులపొడి,నిమ్మరసము వేసి కలుపుకుంటే చిత్రన్నమ్ము తయ్యార్ ......
No comments:
Post a Comment