రాగి సంకటి :
రాగి సంకటి కి కావలిసినవి:
అన్నము :1 గ్లాస్ [బియ్యము]
రాగి పిండి :1/2 గ్లాస్
ఉప్పు : తగినంత
నీళ్ళు : [1] గ్లాస్ అన్నానికి [5] గ్లస్స్లల నీళ్ళు
i
చేసే విధానము :
1. మొదట అన్నము చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. పొయ్యి మీద బాణలి పెట్టి నీరు పోసి కాగనియ్యాలి .
3. కాగిన నీటిలో అన్నము, ఉప్పు వేసి కాస్త ఉడక నియ్యాలి.
4. ఉడుకుతున్న అన్నములో రాగిపిండి వేయాలి
[మధ్యలో (బొమ్మలో చూపించిన మాదిరి ) వేసుకోవాలి ]
5. కదపకుండా ఒక పది నిముషాలు వుంచి తరువాత బాగా కలుపుకోవాలి , వుంటలు లేకుoడా [మరీ గట్టిగ వుంటే తగినన్ని నీళ్ళు
పక్కన గిన్నెలో కంచి సంకటి లో వేసి కలిపాలి ] కలుపుకొని దించుకోవాలి.
అంతే ఎంతో రుచికరమయిన సంకటి తయ్యార్................
వంకాయ పచ్చడి [సంకటి లో నంచుకోవడానికి ]
పచ్చడి [చట్నీ]తయారుకు
కావలిసినవి :
వంకాయలు - 1/4 kg
ఉల్లిగడ్డలు - 2
పచ్చి మిరపకాయలు - 7
చింతపండు - గోరిస
బెల్లము - తీపు సరిపడా
పచ్చి కొబ్బెర - కాస్త
నూనే - 4 tsp
తాయారు చేసే పద్దతి :పక్కన చింతపండు నన బెట్టుకోవాలి,
బాణలి లో నూనే వేసి కగినాక
ఉల్లిగడ్డ,పచ్చిమిరపకాయలు,వంకాయలు అన్ని ముక్కలు చేసి వేసుకోవాలి
కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి కలిపి ముఉత పెట్టుకుంటే సరి ,మద్య
మద్య లో కలుపుతూ వుండాలి , మగ్గినాక దించి చల్లార బెట్టుకొని మిక్సీ
లో చింతపండు,తగినంత బెల్లము,కావలిసినంత ఉప్పు, వేసుకుని తిప్పుకుంటే సరి [వేగిన ఉల్లిగడ్డలు కొన్ని మాత్రమూ పక్కన గిన్నెలో తీసుకోండి ](కచ్చ పచ్చ ,నీళ్ళు వేయకండి ).
పచ్చి పులుసు :
కావలిసిన పదార్తములు :
ఉల్లిగడ్డ - 1[ముక్కలు సన్నవి] , చింతపండు పులుసు - 1 కప్ [నీళ్ళ గా] , బెల్లము - తగినంతఉప్పు - తగినంత , కరము ఒట్టిది - 1/2 tsp తిరవత గింజలు [ఆవాలు,మినపబేడలు,జీలకర్ర,కర్వేప]
తయ్యారు పద్దతి : పైన చప్పినవాన్ని చింతపండు నీటిలో కలిపి నూనే పెట్టి తిరవత వేసు కుంటే సరి ....పచ్చిపులుసు తయ్యార్ ...........
కావాలి అంటె సంబారు చేసుకోవచ్చు , పెరుగుతో తింటే మంచి చలువ
కాబట్టి ఎండాకాలం స్పెషల్ రాగి సంకటి తిని ఆనందించండి...................
No comments:
Post a Comment