Top Food Blogs

Monday, February 28, 2011

VANGI BATH


వాగిబాత్ అన్నము 
(రైస్ ఐటెం) 

వాగిబత్ పొడి తయారుకు కావలిసినవి:

పూత - 35 గ్రా 

మొగ్గ - 25 గ్రా 

చెక్క - 5 గ్రా 

లవంగాలు - 1 తులము 

మిరియాలు - 1/2 తులము 

ధనియాలు - 50 గ్రా 

వట్టిమిరపకాయలు - 100 గ్రా 

వట్టికోబ్బెర - 1 చిప్ప 

జీలకర్ర - 2 tsp 

శనగ బేడలు - అరపావు [చిట్టి or చటాకు -1 or 1 చిన్న గ్లాస్]

మినప బేడలు - అరపావు [చిట్టి or చటాకు -1 or 1 చిన్న గ్లాస్]

ఇంగువ  కొద్దిగా -1/4 tsp 

పైన  చెప్పినవన్నీ  ఒక్కో ఒక్కోటే  సన్న మంట  మీద  వేయించి  పక్కన 
పెట్టుకోవాలి. వేయిన్చినాక  అన్ని కలిపి  మిక్సీ  వేసుకుంటే  పొడి తయ్యారు .

చిట్కా : పూత  శుబ్రముగా  వలుచు కోవాలి  దానికి  చక్కలాంటి  బెరడు  
లాంటిది  వుంటాది అది  బాగా  క్లీన్ గ వలచి  పారేయండి  లేకుంటే  చేదు
వస్తుంది .

వేయిన్చే టప్పుడు నూనె బదులు  నెయ్యి వాడండి .

వేగినాయి అని తెలుసుకోవాలి అంటే వేగినప్పుడు అవి మంచి సువాసన  వస్తాయి.

పొడి తాయారు అయినప్పుడు మొదటిసారి అన్నములో కలిపినప్పుడు 
కాస్త చేదు అని అనిపిస్తే కాస్త శనగ ,మినప బెడలు వేయించి పొడి చేసి కలుపుకోండి.

ఈ పొడి వగిబాత్ అన్నముకు , మరియు బిసిబెలాబాత్  అన్నములోకి కూడా 
కారముతోపాటు కలిపి వేసుకోవచ్చు .

ఒకసారి చేసుకుంటే ఒక ఏడాది  వరకు వుంటుంది ,చెడిపోదు ,
ఇంటిలోచేసినపొడి రుచి వేరు కొన్నదనికంటే ,ప్రయత్నించండి  .................   

వంగిబాత్ అన్నము తాయారు చేసుకున్నే పద్దతి :

మొదట అన్నము చేసుకోవాలి 
బాణలిలో నూనె వేసి
 [ఒక గ్లాస్ అన్నానానికి 10 [or] 15 tsp నునే వేసుకోవచ్చు] కాగినక తిరవాత
వేసుకోవాలి [శనగ ,మినప బేడలు,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు]వేగినాక 
ఉర్లగడ్డ -2 ,సీమవంకాయలు-1 or 2 [ఇవి లేకపోతె దోసకాయలు వేసుకోండి]
వంకాయలు -4 ,అన్ని ముక్కలు చేసుకొని వేగిన తిరవాతలో వేసి పసుపు 
కాస్త వేసి [మధ్యస్థము మంట]మూత మూసి మధ్య మధ్య లో కలుతూ 
వుoడాలి,ముక్కలు మగ్గినక పొయ్యి బంద్ చేసుకొని మగ్గిన కూర ముక్కలు అన్నములో వేసి తగినంత పొడి [4 or 5 tsp] ఉప్పు ,నిమ్మరసం వేసి కలుపుకోవాలి అoతే...................


























No comments:

Post a Comment