- బెండకాయ చిప్స్
బెండకాయలు
ఉప్పు
కారము
ఒట్టికొబ్బెర
పసుపు
మొదట బెండకాయలు బాగా కడిగి తుడిచి అరబెట్టుకోవాలి ,
అలా ఆరిన బెండకాయలని సన్న సన్న ముక్కలుగా[ గుండ్రoగా ] కట్
చేసుకోవాలి. తరువాత పెన్నములో నూనే పోసుకొని [అప్పడాలు వేయించడానికి వేసుకున్నంత నూనే పడ్తుంది] కాగినాక బెండకాయ ముక్కలు వేసి వేయించుకొని తీసుకోవాలి , అన్ని వేయిన్చుకున్నాక
[వేగినాయి అని ఎలా తెలుసుకోవాలి అంటే బెండకాయలు నూనే లో వేసినప్పుడు, వేగినాయి అంటే నూనె నురుగు ఆరి పోతుంది,వేయిన్చేటప్పుడు బెండకాయలని కాస్త కలుపుతూ [వేయించడము]వుండండి ఎందుకు అంటే అన్ని సమంగా వేగుతయికాబట్టి] ప్లేటులోకి తీసుకొని ఉప్పు,కారం,
ఒట్టికోబ్బెర,పసుపు,కలిపి మిక్సీ వేసుకున్న పొడి వేసి కలుపుకోవాలి అంతే
బెండకయచిప్స్ తయార్ .....................
చల్లారినాక డబ్బాలోకి వేసి ముసి పెట్టుకుంటే 10 - 15 రోజుల వరకు నిలువ వుంటాయి .
సలహా: ఈ చిప్స్ పప్పు అన్నములో పెరుగు అన్నములో అద్దు కొని తిని చుడండి ....................
No comments:
Post a Comment