Top Food Blogs

Tuesday, February 22, 2011

DOSA AND TYPES CHUTNEES FOR DOSA

 
  • Dosa &and -  Side dishes 
దోసకుకావలిసినపదార్ధములు :

బియ్యము : 3 గ్లస్సులు                        
(మామూలు అన్నము చేసేవి)

ఉద్దిబేడలు(మినప బేడలు):1 గ్లాస్   

ఉదయము నానబెట్టి సాయంకాలము 

రుబ్బుకోవాలి .



నోట్ :పిండిలో ఉప్పు యప్పుడు కావలి అన్టే అప్పుడు ఆకాస్త పిండిలో 

కలుపుకుంటే పిండి పుల్లగా కాదు .

దోసపిండిలో ఉప్పు చిటికెడు 

సోలపొడి 

తగినన్ని నీరు కలిపి దోసెలు పోసుకోవాలి 

దోసేలల్లోకి ఎన్నోరకాలు చేసుకుంటారు కొన్ని మీకోసం:

పప్పుల చట్ని[పుట్నాలు]

పప్పులు  1 కప్పు 


పచ్చిమిరపకాయలు -4 


ఉప్పు తగినంత 


కొత్తిమీర కాస్త 

పచ్చి కొబ్బెర 1/2 చిప్ప [సన్నగాముక్కలు కోసుకొని]


  •     పెయిన చెప్పినవన్నీ మిక్సీలో కాస్త నీరు వేసి రుబ్బుకొని గిన్నెలోకి 
తీసుకోవాలి.

తరువాత తిరవాత (ఆవాలు,జీలకర్ర,మేనపబేడలు,కరివేపాకు)

వేసుకోవాలి .

బుడ్డల చట్ని[చనక్కాయలు]:

చనక్కాయలు(వేయించినవి)-1 cup 

పచ్చిమిరపకాయలు(వేయించినవి)-4 

పచ్సికోబ్బెర -1/4 చిప్ప 

ఉప్పు

నునే

తిరవాత గింజలు-1tsp     


  •   పెయిన చెప్పినవన్నీ మిక్సీలో కాస్త నీరు వేసి రుబ్బుకొని గిన్నెలోకి 
తీసుకోవాలి.

తరువాత తిరవాత (ఆవాలు,జీలకర్ర,మేనపబేడలు,కరివేపాకు)వేసుకోవాలి . 

ఎర్రకారం[ఉల్లిగడ్డ కారం]:

ఉల్లిగడ్డలు -4 

ఒట్టిమిరపకాయలు - 8  

ఒట్టికోబ్బెర కాస్త 

ఉప్పు

బెల్లము[1/4 tsp]

చింతపండు[గోరిస]

పెయిన చెప్పినవస్తువుల్లన్ని మిక్సీలోవేసి తిప్పి పెట్టుకోవాలి.

నోట్: పెన్నము మీద దోస కాలినాక ఈ కారము పుసి , చట్నితో కాని బొంబాయి చట్నితో కాని తినవచ్చు.

లేదుఅంటే దోసేమీద చట్ని ఎర్రకారము పుసి కాస్త 

నెయ్యి వేసి తిన్టేకూడ బాగుంటుoది .   


బొంబాయి చట్ని

ఉల్లిగడ్డలు(నిలువగా కట్ చేసుకోవాలి)-7 

ఆలుగడ్డ - 1 

పచ్చిమిరపకాయలు -5 

ఉప్పు తగినంత

శనగపిండి-5tsp 

నునే-3tsp 

తయారు చేసుకునే  పధ్ధతి - 

పెన్నములో[లేక]గిన్నెలో కాస్త నునే వేసి తిరవత వేసి ఆలు ముక్కలు వేసి 

రెండు నిమిషాల తరవాత ఉల్లిగడ్డలు వేసి రెండు నిమిషాల తరువాత నీరు 

ఒక గ్లాస్ పోసి,కాస్త పసుపు వేసి మూత మూసి ఉంచాలి.ఉల్లిగడ్డలు

ఉడికినాక  కాస్తనీటిలో  శనగపిండి  కలిపి  పోసి తగినంత  ఉప్పు వేసి 

సన్నటి మంటమీద  మగ్గబెట్టి  దిoచుకోవాలి .


ఉల్లిగడ్డకారం(పచ్చిది)




ఉల్లిగడ్డలు -7 

పచ్చిమిరపకాయలు -10 [సరిపడినంత ]

చింతపండు [గోరిసే [or]కాస్త],ఉప్పు ,బెల్లము 

కుక్కర్ర్ లో ఉల్లిగడ్డ ముక్కలు,పచ్సిమిరపకాయలు,కాస్త పసుపు,చింతపండు

కాస్త నీళ్ళు వేసి ఉడికిoచుకొవాలి,నీరు వంచేసి చల్లారినాక మిక్సీ లో ఉప్పు 

కాస్త పచ్చి కొబ్బెర,ఉప్పు,బెల్లము,[చింతపండు తీసివేయాలి]ఉడికించిన 

ఉల్లిగడ్డలు వేసి తిప్పుకోవాలి,చివరకు రెండు చంచాల పప్పులపొడి

[పుట్నాలపొడి]వేసి కలుపుకొని ,పెన్నము మీద దోస కాలినాక ఈ కారము 

పూసుకోవాలి.

కొబ్బెరపొడి [తీపుది]

పచ్చికోబ్బెర్ర  తురుముకున్నది - 1 కప్ 

 తీసుకోవాలి దానిలోకి  

[పచ్చిమిరపకాయలు,కాస్త చింతపండు,ఉప్పు]కలిపి వేసిన పేస్టు,

కాస్త బెల్లము,సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డలు వేసి కలిపి కాలిన దోస 

మీదవేసుకొని తినాలి.

కారముదోసలు : 

కస్తపుల్లటి పిండిలో తగినన్నిపచ్చిమిరపకాయలు,ఉప్పు 

కాస్త అల్లము,కొత్తిమీర,జీలకర్ర1/4tsp ,వేసి మిక్సీ పట్టి  ఒకటి లేక రెండు 

ఉల్లిగడ్డదముక్కలు వేసి కచ్చ పచ్చగ తిప్పి దోసలు వేసుకోవచ్చు.

నోట్ : పెయిన చెప్పిన కారములో పచ్చిమిరపకాయలకు బదులు 

ఒట్టికారము కూడా  వాడవచ్చు.

గుంతపొంగానాలు[పోగానాలు]: 

సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డలు కాస్త 

పుల్లటి పిండిలో వేయాలి [ఉల్లిగడ్డలు దండిగే పడతాయి]

(ఉప్పు,పచ్చిమిరపకాయలు,కొత్తిమీర) పేస్టే ,కాస్త కరివేపాకు,ఒకచంచా

శనగబేడలు,కాస్త జీలకర,కాస్త పసుపు,కొంచం సోలపొడి వేసి కలిపి 

పొంగానాలు వేసుకోవాలి.(ఇవి కొంచం కరకర వస్తాయి).

నోట్ :పోగానాలపిండి మరీ నీల్లగా ఉండకూడదు.

చిట్కా : పొంగానాలు రుబ్బుకున్న దోస పిండి అడుగుపిండి వేసిన 

బాగావస్తాయి.బొరుగులు మిక్సీ లో తిప్పి దోసపిండిలో వేస్తె పిండి పులుపు 

తగ్గి పోగానాలు మృదువుగా [soft] వస్తాయి  

కారముదోసేలు అంతే ,మొదటిరోజుకoటే తరువాతనే రుచి బాగుంటాయి .

మీరు పిండి రుబ్బుకున్నాక మరునాటికి ఎంత అవసరమో అంత చిన్న 

గిన్నె లో తీసుకొని దానిలో ఉప్పు సోలపొడి కలిపి పెడితే మరునాటికి కాస్త 

పులుస్తాది.మిగిలినది fridge లో పెట్టు కొండి .
         
మెత్త పోగానాలు

3 glasses బియ్యము 

1/4 glass ఉద్దిబెడలు 

1/2 glass అటుకులు  ఉదయం నానబెట్టి సాయంకాలము 

రుబ్బుకోవాలి , పిండి తయ్యార్ .

ఎంతపింది అవసరమో అంత బెయిట పెట్టుకొని దానిలో 

 సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డలు  [ఉల్లిగడ్డలు దండిగే పడతాయి]

(ఉప్పు,పచ్చిమిరపకాయలు,కొత్తిమీర) పేస్టే ,కాస్త కరివేపాకు,ఒకచంచా

శనగబేడలు,కాస్త జీలకర,కాస్త పసుపు,కొంచం సోలపొడి వేసి కలిపి 

పొంగానాలు వేసుకోవాలి.












ఇవండీ దోశకు రకాలు చేసుకొని ఆనందించండి. 














No comments:

Post a Comment