
సొర్రకాయ తపిలెంటు
అనపకాయల పులుసు
సొర్రకాయ తపిలెంటు కు కావలసిన పదార్థములు :
- తురుముకున్న సొర్రకాయ
- పచ్చిమిరపకాయలు ,ఉప్పు, కొత్తిమీర - మెత్తగా దంచుకొని ఇంక ఉల్లిగడ్డలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి [రెండు తపిలెoటులకు ఒక ఉల్లిగడ్డ ,కప్పు తురుము]
- జొన్నపిండి - 2 చిట్లు
- శనగబెడలు - 2 tsp
- జీలకర్ర - 1 tsp
- కరివేపాకు - 20 ఆకులు
- కర్చిఎఫ్
- నూనే - కాల్చుకోవటానికి
మొదట పచ్చిమిరపకాయలు,ఉప్పు,కొత్తిమీర మిక్సీ లో తిప్పుకోవాలి
దానిలోనే తరుగుకున్న ఉల్లిగడ్డలు వేసి కచ్చ పచ్చ తప్పి ఒక పళ్ళెములో
వేసుకోవాలి ,దానిలోనే తురుముకున్న సోర్రకాయ,జొన్నపిండి,జీలకర్ర,
శనగబెడలు,కరివేపాకు వేసి బాగా కలిపి [సోర్రకాయ లో నీరు వుంటాది
కాబట్టి నీరు పట్టదు ( ముదురుకాయ అయితే నీళ్ళు పడతాయి)]
{గమనిక: పిండి తడిపితే చపాతీ పిండికంటే మెత్తగా వుండాలి}
పిండి తయారు చేసినాక చపాతీ పలక మీద తడి బట్ట వేసి దాని మీద
చపాతీ అంతఉల్లే చేసుకొని తట్టి [పల్చగా చేతితో]బట్ట తో సహా పెన్నము
మీదవేసి నిదానముగా బట్ట తీసి నునే వేసి మూత పెట్టి (పెద్ద మంట)
రెండు నిమిషముల తరువాత మూతతీసి రొట్టె తిప్పి కాల్చుకొని తినవలెను.
అనపకాయ పులుసు :
ఒట్టి కొబ్బెర - 3 tsp
పప్పులపొడి - 4 tsp
బెల్లము - 2 tsp
ఉప్పు - తగినంత
కారము - 1 tsp
చెక్క - 1/2 inch
లవoగాలు-2
చేసే విధానము :
మొదట విత్తనాలు ఉడకబెట్టి వలిచి పెట్టుకోవాలి,బాoడలిలో
కాస్త నూనే వేసి కాస్త చెక్క రెండు లవంగాలు వేసి వేగినాక తీసి మిక్సీ లో
వేసి జతకు ,ఎండు కొబ్బెర కొంచము [1/4 చిప్ప],ఉప్పు,ఎర్ర కారము వేసి
తిప్పు కొని పక్కన పెట్టుకోవాలి.
మల్లి బాణలిలో రెండు చెంచాల నూనే వేసి ,పెద్దవి రెండు ఉల్లిగాడ్డలు
ముక్కలుగ చేసి వేసి కాస్త మగ్గినక నాలుగు టమోటా పండ్ల ముక్కలు
[పులుపు దీనివల్లనే వస్తాది]వేసి మగ్గినక వలిచిన అనపవిత్తనాలు
కావలిసినంత బెల్లము పెయిన తయారు చేసుకున్న మసాల పొడి తగినన్ని
నీళ్ళు వేసి మూత పెట్టి మగ్గినాక [చిన్నగిన్నేలో 1/2 గ్లాస్ నీరు పోసి దానిలో
పప్పులపొడి వేసి వుంటలు లేకుండా కలిపిపెట్టుకోవాలి]తాయారు
చేసుకున్న ఉత్త పప్పుల పొడి పేస్టు వేసి కలిపి [medium మంట]అయిదు
నిమిషముల తరువాత దించుకోవాలి .
సలహా :ఈ కూర చపాతీ , పుల్క , పూరి కి కూడా బాగుంటాది ...............
No comments:
Post a Comment