పులిహోరపులుసు కు కావలిసినవి :

పిడికెడు మినపబేడలు
పిడికెడు శనగబేడలు
పిడికెడు ధనియాలు
1 tsp జీలకర్ర
1/2tsp మెంతులు
1 అచ్చు బెల్లము
1/2 చిట్టి నూగులు
30 వట్టిమిరపకాయలు
రుచికి తగ్గ ఉప్పు ,
తాయారు చయుపద్దతి :
మొదటనూగులు,శనగబేడలుమినపబేడలు,జీలకర్ర,ధనియాలు,వట్టిమిరపకాయలు,మెంతులు
అన్నియు విడి విడిగ ఒక tsp ఆయిల్ వేస్తూ వేయించి పక్కన పట్టుకోవాలి.చల్లారినాక పొడిచాసుకోవాలి,
ఒక పెన్నములో సేరు {250 grms} నూనె పోసి కాగినాక తిరవాతకు కొద్దిగా శనగబేడలు, ఆవాలు,
జీలకర్ర, మినపబేడలు, 5 వట్టిమిరపకాయలు,వేసి వేగినాక గట్టిగ పిండుకున్న చింతపండు పులుసు
వేసి మీడియం మంటమీద మగ్గపెట్టాలి.ఒకపదినిమిషములు మాగ్గినక ముందు తాయారు చేసుకున్న
పొడి {మసాల }ఒక చిన్న గ్లాస్ నీటిలో కలిపి {ఉండలు లేకుండా}ఉడుకుతున్న పులుసులో పోసి
బెల్లము,ఉప్పు వేసి బాగా మగ్గినాక అంటే చిక్కపడినాక దించుకోవాలి .
note: కావాలిఅంటే నల్ల శనగలు ముందురోజు నానబెట్టి వంచి తిరవాత వేసుకున్నప్పుడువేసుకో వచ్చు}
అన్నములో ఎవరికీ ఎంత కావలి అంటే అంత కలుపుకోవచ్చు ,కాస్తనూనె వేసి వంకాయలు వుర్లగడ్డలువేసి
మగ్గపెట్టి పులుసు వేసి అన్నములో కలుపుకోవచ్చు . fridge లో పెట్టుకుంటే 20 రోజుల వరకు వుంటాది .
No comments:
Post a Comment