కొన్ని రోటి పచ్చల్లు తెలుసుకుoదాము : [చట్నీలు అన్నములోకి ]
1 . పెసర పచ్చడి : కావలసిన పదార్థములు - పిడికెడు పెసరబేడలు {నానబెట్టినవి} పచ్చిమిరపకాయలు -6 , పచ్చికొబ్బెర-1/2 చిప్ప, ఉప్పు ఎవరిరుచికి తగినఅంత ,
ఇవన్ని[ రోటిలో] కాని మిక్సి వేసుకోవచ్చు ,1 నిమ్మకాయ రసం వేసుకొని కావాలిఅంటే
ఇంగువతిరవాత పెట్టుకోవచ్చు.
2 . బెండకాయ పచ్చడి : బెoడకాయలు 1/4 kg
కరివేపాకు ఒకరూపాయది
నానబెట్టిన చింతపండు
తగినంత ఉప్పు
నూనె
ఒట్టిమిరపకాయలు
కొత్తిమీర కాస్త
బెoడకాయలు నూనె వేసి బాగా వేయించుకోవాలి , కరివేపాకు కుడా వేసి వేయిoచుకోవాలి , ఒట్టిమిరపకాయలు వేయించుకోవాలి.[ విడి విడిగ] ,తరవాత మిక్సీలో మొదట చింతపండు[నానబెట్టినది] , ఉప్పు వేయించిన ఒట్టిమిరపకాయలు వేసి తిప్పుకోవాలి , తగినంత బెల్లము వేసి మల్ల తిప్పు కోవాలి చివరకు వేయించిన బెండకాయలు వేసి కచ్చా పచ్చాగా తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి .
3 . సిరికూర పచ్చడి : సిరికూర 4 కట్టలు
జీలకర్ర 1/2 tsp
పచ్చిమిరపకాయలు సరిపడినంత
బెల్లము వారి వారి ఇష్టము
2 tsp నూనె
బాండీలో నూనె వేసి జీలకర్ర ,పచ్చిమిరపకాయలు వేయిoచుకొని పక్కన పెట్టుకొవాలి ,తరువాత కాస్త నూనె వేసి వలిచిన[బాగా రెండు సార్లు కాస్త ఉప్పు వేసి కడిగిన] సిరి కూరను సన్నటి సెగ మీద మగ్గబెట్టి పెట్టుకోవాలి .
ఇవన్ని [రోటిలో] మిక్సీలో వేసి జతకి తగినంత ఉప్పు ,బెల్లము వేసి రుబ్బుకోవాలి .[ఆకు చివర్న వేసి కచ్చ పచ్చ]
4 . చుక్కకూర పచ్చడి : చుక్కకూర 2 కట్టలు
మెంతులు 1/2 tsp
పచ్చిమిరపకాయలు [తగినంత]
కొత్తిమీర కాస్త
ఉప్పు
నూనె 4 tsp , ఉల్లిగడ్డలు - 2
బాండిలో నూనె వేసి మెంతులు వేసి ఉల్లిగడ్డల ముక్కలు ,పచ్సిమిరపకాయాలు వేసి వేయించి కడిగిన ఆకుకూరను వేసి సన్నటి సెగమీద మగ్గబెట్టి దేగ్గరపడినాక పొయ్యి బంద్ చేసి కొత్తిమీర వేసి దిన్చాలి. చల్లారినాక ఉప్పువేసి
[ రోటిలోకాని ,మిక్సీలో కాని , పప్పుగుత్తితో కాని] మెదుపుకోవాలి.
5 . దొండకాయ పచ్చడి : దొండకాయలు - 10
జీలకర్ర - 1/4 tsp
ఉల్లిగడ్డ చిన్నది
పచ్చిమిరపకాయలు ఎవరికీ సరిపడినంత
ఉప్పు రుచికి తగినంత , కాస్త [గోరిస] చింతపండు
దొండకాయలు కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి ,మిక్సీ లో మిరపకాయలు,జీర,ఉప్పు,చింతపండు,
వేసి తిప్పుకోవాలి చివరికి దొండకాయ ముక్కలు వేసి కాచ్చాపచ్చగా తిప్పుకోవాలి .
6 . దొండకాయ పచ్చడి [ 2 ] : దొండకాయలు - 10
పచ్చిమిరపకాయలు ఎవరిరుచికితగినంత
చింతపండు కాస్త [రెండు గోరిసేలు]
ఉల్లిగడ్డ ఒకటి
ఉప్పు , ఎల్లిపాయలు -5 ,కాస్త నూనె
దొండకాయలు,మిరపకాయలు రెండు స్పూన్ల నూనె వేసి మగ్గపెట్టుకోవాలి,తర్వాత మిక్సీ వేసుకోవాలి[కచ్చపచ్చ]
ఉప్పు నానబెట్టిన చింతపండు వేసి తిప్పి పచ్చికోబ్బెర కాస్త వేసి తిప్పి తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి తిప్పి
[కాచ్చా పచ్చ]గిన్నేలో తిసుకోవాలి . చివరికి ఎల్లిపాయలు [చితకేసి]వేసి తిరవాత పెట్టుకోవాలి .
7 . కొత్తిమీర పచ్చడి [నిలువ-15 డేస్] : వట్టిమిరపకాయలు - [10,12]
చింతపండు [నిమ్మకాయంత]
ఉప్పు తగినంత
కొత్తిమీరా ఒక పెదాకట్ట
ఉప్పు, నూనె [14 tsp]
తిరవాత దినుసులు [శనగబేడలు-1tsp ,మినపబేడలు-1/2 tsp , ఆవాలు,జీలకర్ర]
వేయించిన వట్టిమిరపకాయలు , కొత్తిమీర,ఉప్పు ,నానబెట్టిన చింతపండు[రోటిలో కాని మిక్సీలో] మేదుపుకోవాలి [మెత్తగా].
తరవాత బాణలిలో [nonstick pan(or)bowl] నునే వేసి తిరవాతగిoజలు వేసి వేగినాక మొదట తయారుచేసుకున్న కొతీమేర పేస్టు వేసి సనాటి సెగ మీద మగ్గ బెట్టిదిన్చుకోవాలి .
తరవాత బాణలిలో [nonstick pan(or)bowl] నునే వేసి తిరవాతగిoజలు వేసి వేగినాక మొదట తయారుచేసుకున్న కొతీమేర పేస్టు వేసి సనాటి సెగ మీద మగ్గ బెట్టిదిన్చుకోవాలి .
నోట్ : కావలి అంటే తీపు [బెల్లము]వేసుకోవచ్చు.
No comments:
Post a Comment