Top Food Blogs

Wednesday, January 30, 2013

EGG DROP CURRY - FOR CHEPATHI OR RICE

ఈ   కూర  చెపాతీల కు  చాలా  చాలా బాగుంది  నాకు  ఎగ్  తో  కూరలు నేర్చుకోవాలి అని  చాల  రోజుల నుంచి కోరిక  మొన్న  పేపర్  లో చూసి  చేశా  చాలా  చాలా  బాగా వచ్చింది  నాకు  కావలిసిన  విదoగా.

మసాలకు  కావలిసిన  పదార్థములు -


  • ఒట్టి  మిరపకాయలు - 6
  • ధనియాలు - 2 tsp 
  • జీలకర్ర - 1 tsp 
  • పసుపు - కాస్త 
  • ఒట్టి  కొబ్బెర  తురుము [ముక్కలు ] -  4 tsp 
  • చింతపండు - అర  నిమ్మకాయ  అంత 
  • వెల్లుల్లి  రెబ్భలు - 6 


ఇలా  అన్ని  మిక్సీ  లో వేసుకొని   ముద్దగా  వేసుకొని  [కావాలి  అంటే  కాస్త నీరు  వేసుకొని  తిప్పుకోండి]




కూరకు  కావలిసిన  పదార్థములు -
  • ఉల్లిగడ్డ - 3
  • టమోటా - 2
  • వెల్లుల్లి - 6
  • పచ్చికోబ్బెర - 1/2 చిప్ప [ చిప్ప  ముక్కలు  చేసుకొని  మిక్సీ  లో వేసుకొని మెత్తగా  తిప్పుకొని  పిండుకొంటే పాలు వస్తుంది వాటిని ఒక కప్  లో పెట్టుకోండి ]
  • గుడ్లు - 5
  • ఉప్పు - సరిపడ 
తయారు చేసుకుందాము - 
  • మొదట  పెన్నము  పెట్టుకొని  నూనె  - 3 tsp   కాగినాక  [పొట్టు  తీసుకొని కడిగి  తరుగుకున్న ఉల్లిగడ్డలు] ఉల్లిగడ్డలు వేసుకొని  పొత్తు తీసుకొన్న ఎల్లిపాయలు వేసుకొని  

  • తరువాత   కడిగి  తరుగుకున్న  టమోటా  ముక్కలు  వేసుకొని  మధ్యస్తపు మంట మీద  వేయించుకోవాలి 
  • తరువాత   ముందుగా  చేసుకున్న  మసాలా  వేసుకొని  వేయించుకోవాలి ఒక 5 mint 's 

  • తరువాత  పసుపు  వేసుకొని బాగా  కలిపి  కాస్త  ఉప్పు  వేసుకొని కలిపి  ఒక 2 కప్పుల  నీళ్ళు  వేసుకొని  వుడకనీయాలి  ఒక 5 నిముషములు ................
  • ఇప్పుడు గుడ్డును  పగలకోట్టుకొని  సొనను  జాగ్రత్తగా  వెయ్యాలి కూరలో 
  • ఈ  సోనాను  ఒక  దానికి  ఒకటి  తగలనీయకుండా  చెదిరిపోకుండా  జాగ్రత్త  గా  వేయాలి 

  • అలాగే  ఒక 5 mint 's  కలపకుండా  వుండండి ....................తరువాత   స్పూన్  గ్రేవీ  ని  గుడ్ల  సోనా  మీద  వచ్చేలా   చుసుకూవాలి .

  • ఇంక  ఇప్పుడు   గుడ్డు  వుడికే వరకు  కలపకుండా   వుండాలి  సన్న మంట  మీద  ఒక  మూత   మూసుకొని  . 
  • వుడికిన తరువాత  ముందుగా  తయారు చేసుకున్న  కొబ్బెరే  పాలు  వేసుకొని  మెల్లగా  సైడ్ లు   కదపండి   ఒక  5 నిముషములు  

  • ఇంక  కూర   తయారు  అయినట్టే   లెక్క  కొత్తిమీర  వేసుకొని  దించుకుంటే సరి ..........
  • డ్రాప్  కూర తయ్యార్  వేడి వేడి చేపతి కి  తినండి .........


PS:Please leave a comment once you are done.
      Thank You!
For more recipes check my blog - ammachethiruchi.blogspot.com

No comments:

Post a Comment