Top Food Blogs

Friday, January 25, 2013

CAULIFLOWER AALOO GREEN PEAS CURRY - FOR CHEPATHI OR ROTI


ఈ  కుర రోటి లోకి  చెపాతి  చాలా  బాగుంటుంది . క్యాలిఫ్లవర్ తో ఎన్నో కూరలు చేస్తుంటారు  ఇది  ఒక  తక్కువ మసాలాతో  ఇంకా  పచ్చిబటానీ లతో   కలిపి  చేసేది  , చాలా  బాగుంటుంది  . చేసి  చూడండి .

కావలిసిన పదార్థములు - 

  • క్యాలి ఫ్లవర్ - 1 medium
  • వుర్లగడ్డలు  - 2 
  • పచ్చి  బటాణీలు - 1 కప్ 
  • ఉల్లిగడ్డలు  - 2 
  • నెయ్యి  or  నూనే - 2 tsp 
  • పెరుగు - 2 t sp 
  • కుంకుంపువ్వు  - కాస్త 
  1. మసాలా తయారు చేసుకుందాము  -
  •  ధనియాలు - 2 tsp 
  • అల్లము - 1/2 inch 
  • ఒట్టి  మిరపకాయలు - 8 
పైన  చెప్పినవన్నీ  మిక్సీ  జార్ లో  వేసుకొని  కాస్త  నీరు వేసుకొని  మెత్త గా  తిప్పుకొని  పక్కన  పెట్టుకోవాలి . 
  1. ఇప్పుడు  ఇంకొక  పేస్టు చేసి పెట్టుకోవాలి అది .............
  2. ఉల్లిగడ్డ ముద్దకి -
  • ఉల్లిగడ్డలు  - 3  [ పొట్టు  తీసుకొని  కడిగి  ముక్కలు చేసుకొని  ఒక  పెన్నము  పెట్టి   వేడి అయ్యాక  కాస్త  నెయ్యి వేసుకొని  తరిగిన ఉల్లిగడ్డలు   వేసుకొని   ఒక 5 mint's  వేయించుకొని  చల్లరినాక  మిక్సీ  లో  తిప్పుకొని  పక్కన  పెట్టుకోవాలి ]

  1.  ఇంక   ఇప్పుడు  కూర   చేసుకుoదాము  - 
క్యాలిఫ్లోవేర్   పూరెమ్మల్ని  విడదీయాలి , తరువాత  వేడి నీటిలో ఒక 5 mint's  వుంచి  నీటిని  వడ కట్టాలి .

 పొట్టు  తీసుకొని  కడిగి  పొడువు  ముక్కలు చేసుకొని  పెట్టుకోవాలి .

బంగాల దుంపలు  చేక్కుతీసుకొని   కడిగి   ముక్కలు చేసుకొని  నీటి లో వేసుకొని పెట్టుకోవాలి .

పొయ్యి  ముట్టించి  పెన్నము  పెట్టుకొని  నెయ్యి  వేసుకొని 2 tsp   కాగినాక  ఉల్లిగడ్డ ముక్కలు  వేసుకొని  ఎర్రగా  వేయించుకొని  ,


తరువాత  మసాలా  ముద్ద  వేసుకొని  సన్న మంట మీద ఒక 5 - 8............. నిముషములు  వేయించుకొని  క్యాలిఫ్లవర్  ముక్కలు   వేసుకొని  , ఉర్లగడ్డ  ముక్కలు వేసుకొని   బాగా కలిపి   ఒక  గ్లాస్ నీరు వేసుకొని కాస్త పసుపు , ఉప్పు వేసుకొని మూత   ముసి .......................

అర్ధము వుడికిన  తరువాత  పచ్చి  బటానీలు   వేసుకొని మల్ల   మూత  ముసి  వుడకనీయాలి  ..........


అన్ని కూరగాయలు  వుడికిన తరువాత  ఉల్లి ముద్ద  వేసుకొని  ఉడకనిచ్చి ఒక 5 mint's  తరువాత  

చివరికి   పెరుగు లో  కుంకుమ పువ్వు  వేసి  బాగా  కలిపి  ఒక  రెండు నిముషముల  తరువాత  దించి  కొత్తిమీర వేసుకుంటే సరి  

వేడి వేడి రోటి  లకు క్యాలిఫ్లోవేర్ కూర   తయ్యార్ .



No comments:

Post a Comment