మష్రూం / పుట్టగొడుగులు వీటితో ఎన్నో రకముల వంటలు చేసుకోవచ్చు నేను వీటితో పలావ్ చేసినాను చాల చాలా బాగుంది మరి మీరు చేసుకొని ఆనందించండి .
కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- బాసుమతి బియ్యము - 2 కప్పులు
- ఉల్లిగడ్డలు - 2
- పుట్టగొడుగులు - 1 ప్యాకెట్ / 250 గ్ర్మ్స్
- పనీర్ - 150 grms
- కాప్సికం - 1 [పెద్దది]
- క్యాలిఫ్లవర్ - 6 రెమ్మలు - కావలిసినంత
- పచ్చిమిరపకాయలు - 6
- దాల్చిన చెక్క - 1/2 inch
- లవంగాలు - 4
- బిరియాని ఆకు - 2
- నెయ్యి - 6 - 7 tsp
- ఉప్పు - తగినంత
- మొదట బియ్యము ఒక సరి కడిగి నీరు పోసి 1/2 గంట నాననియ్యాలి
- తరువాత పొడి పొడిగా ఉడికించు కొని పెట్టుకోవాలి
- ఉల్లిగడ్డలు , పచ్చిమిరపకాయలు , క్యప్సికం ,క్యాలిఫ్లవర్ కడిగి ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి.
- పన్నీరు కూడా సన్నగా ముక్కలు చేసుకోవాలి
- బాణలి పెట్టుకొని నెయ్యి వేసుకొని మొదట పన్నీరు ముక్కలు వేయించుకొని పెట్టుకోవాలి పక్కన
- అందులోనే మొదట తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని కాస్త తరువాత మసాలా దినుసులు [ చెక్క,లవంగము,బిరియాని ఆకు] వేసుకొని వేయించుకొని ఒక 5 నిముషముల తరువాత
- తరిగి పెట్టుకున్న మిగిలిన కూర ముక్కలు వేసుకొని , బాగా కలిపి సన్న మంట మీద మగ్గనీయాలి , ఒప్పలు కాస్త వుదికినాక , తరిగి పెట్టుకున్న పుట్టగొడుగులు కూడా వేసి వేయించుకోవాలి
- అలా అన్ని కూరగాయలు పుట్టగొడుగులు మగ్గినాక తగినంత ఉప్పు వేసి కలిపి పొడిగా వుడికిన్చుకున్న అన్నము వేసి బాగా కలిపి మూత పెట్టి సన్న మంట మీద ఒక 5- 8 నిముషములు మగ్గనిచ్చి దిండి ఆరగించాలి.
No comments:
Post a Comment