సేమ్య పలావ్ ఇది మా అత్త గారి ఇంట్లో నేర్చుకున్న వంట కష్టము అయినది కాదు కాని నాకు తెలిసి చాలా మంది చేసుకోరు అనుకుంట , చాలా రుచిగా వుంటుంది , పలావ్ అంటే ఇష్టము వున్నవారు ఎక్కువ అన్నము తినటము ఇష్టము లేని వారు ఇలా చేసుకోవచ్చు , ఇంకా ఇప్పుడు పిల్లలకి సేలువులు కూడా కదా ఏదో ఒకటి చేసి పెట్టాలి మరి ఇలా తొందరగా అయి పోఏవి చుడండి .........................
కావలిసిన పదార్థములు -
సేమ్య - 2 గ్లాస్సెస్
నూనె - 5 tsp
మసాలా పేస్టు - 3 tsp
ఉల్లిగడ్డలు - 2
ఉప్పు - తగినంత
తయారు చూసుకునే విధి -
కావలిసిన పదార్థములు -
సేమ్య - 2 గ్లాస్సెస్
నూనె - 5 tsp
మసాలా పేస్టు - 3 tsp
ఉల్లిగడ్డలు - 2
ఉప్పు - తగినంత
తయారు చూసుకునే విధి -
- మొదట మసాలా చేసుకుందాము దానికి కావలిసినవి
- అల్లము - 1 అంగుళము
- కొత్తిమీర - 1 కప్
- చెక్క - 1 ఇంచ్
- లవంగములు - 2
- యలక - 1
అల్లము పొట్టు తీసుకొని కడిగి ముక్కలు చేసుకోవాలి.
కొత్తిమీర వొలిచి కడిగి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు ఇంక అల్లము , కొత్తిమీర { పక్కన రోటిలో వేసి దంచుకున్న యలకలు,చెక్క ,లవంగము దంచి పొడి చేసుకొని }మిక్సీ లో వేసుకొని దీనిలో ఈ పొడి వేసుకొని తిప్పుకోవాలి మెత్తగా
ఇంక పలావ్ చేసుకుందామా -
- తరువాత ఒక పెన్నము తీసుకొని నూనే వేసుకొని కాగినాక తరుగుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఎర్రగా అయ్యేవరకు వేయించుకొని మసాలా వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి {ఒక 5 mints}
- ఇవి వేగే లోపటికి పక్కన బాణలిలో ఒక చెంచా నూనే వేసుకొని సేమ్య వేసుకొని ఒక 5 mint's వేయించుకోవాలి
- ఈ వేయించుకున్న వుల్లిగడ్డల్లో 4 గ్లాస్సెస్ నీళ్ళు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మరగనిచ్చాలి
- ఎప్పుడు అవుతే నీరు మరుగుతుందో అప్పుడు మనము వేయించుకున్న సేమ్య వేసుకొని ,ఉడుకు వచ్చిన వెంటనే ఒక సారి కలిపి సన్న మంట మీద ఉడికించుకోవాలి .
- మధ్య మధ్య లో కలుపుతూ వుండండి , ఎప్పుడు అవుతే సేమ్య వుడుకుతుందో పొయ్యి బంద్ చేసుకొని అలాగే ఒక 5 mint 's వున్న తరువాత
- వేసి వేడి గా వడ్డించండి
- కావాలి అంటే పెరుగు - 1/4 లీటర్ లో ఉల్లిగడ్డలు - 1/2 కప్ , ఒక మిరపకాయ , టమాటో - 1 సన్నగా తరిగి పెరుగు పచ్చడి లాగా కలిపి తగినంత ఉపూ వేసుకొని ఈ సేమ్య పలావ్ తో ఇవ్వండి .
\
\
No comments:
Post a Comment