రగడ పట్టి - ఇది ఒక చాట్ , ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరు చాట్ అంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు . బయట ఎన్నో దొరుకుతాయి , కొన్ని చోట్ల దొరకవు , ఇంక కొన్ని దెగ్గర మంచి నూనే వాడారు ఇలా ఎన్నో .......... ఇంట్లో పార్టీ లు ఎవరైన బందువులు వచ్చిన పెట్టండి , కొత్త గా వుంటుంది .
మరి మనము ఇంట్లో చూసుకోవచ్చు ఎంతో సులువుగా రుచిగా మరి చేసుకుందామా ........................
కావలిసిన పదార్థములు -
మరి మనము ఇంట్లో చూసుకోవచ్చు ఎంతో సులువుగా రుచిగా మరి చేసుకుందామా ........................
కావలిసిన పదార్థములు -
- పచ్చి బటానీలు / తెల్ల భటానీలు - 1 కప్ {తెల్ల భటానీలు అవుతే ఒక 10 గంటలు నానా బెట్టాలి}
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 4
- అల్లం వెల్లుల్లి పేస్టు - 1/2 tsp
- ఆవాలు - 1/2 tsp
- కరివేపాకు - 3 రేమల్లు
- ఇంగువ - చిటికెడు
- కారము - 3/4 tsp
- జీలకర్ర పొడి - 1/2 tsp
- ధనియాల పొడి - 1/2 tsp
- బ్లాక్ సాల్ట్ - 1/4 tsp
- మిరియాల పొడి - 1/2 tsp
- పసుపు - 1/2 tsp
- గరం మసాలా - 1/2 tsp
పట్టీ ల కోసము కావలిసినవి -
- బంగాల దుంపలు - 4
- పచ్చిమిర్చి - 2
- అల్లము ముద్ద - 1 tsp
- నూనే - 1 tsp
- కార్న్ ఫ్లోర్ - 2 tsp
- బ్రెడ్ పొడి / ఓట్ట్స్ - 4 tsp
- పసుపు - 1/4 tsp
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - వేయించుకోవడానికి
రగడ మీద వేసుకోవడానికి -
- బూంది - 1 కప్
- చాట్ మసాలా - 1 tsp
- ఉల్లిపాయలు సన్నగా తరిగినవి - 2
- కొత్తిమీర చట్నీ - 1/2 కప్ [green chutney ]
- చింతపండు చట్నీ - 1/2 కప్ [ sweet chutney ]
రగడా తయారు చేయు విధి -
- మొదట బటానీలు కుక్కర్ లో వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని [ తెల్ల బటానీలు అవుతే సోలాపొడి కూడా వేసుకోండి ] వుదికిన్చుకోండి .
- ఉర్లగడ్డలల్లో తగినన్ని నీళ్ళు పోసి కాస్త ఉప్పు వేసి వుడికించి పొట్టు తీసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి .
- బాణలి లో నూనె వేసుకొని - 1 tsp ఆవాలు , కరివేపాకు , ఇంగువ వేయాలి . తరువాత ఉల్లి , పచ్చిమిర్చి ముక్కలు , అల్లము వెల్లుల్లి ముద్ద వేసి మూడు నాలుగు నిముషములు వేయించుకొని , తరువాత ఉడికించిన బటానీలల్లో సగం బటానీలు వేసుకొని దానిలో కారము , ఉప్పు , జీలకర్ర ధనియాల పొడి వేసుకొని కలిపి ఇంక ఇప్పుడు బ్లాక్ సాల్ట్ , మిరియాల పొడి , ఉప్పు , పసుపు వేసి ఒక కప్పు నీళ్ళు వేసుకొని మధ్యస్థము మంట మీద ఉడికించుకోవాలి , చివరికి గరం మసాలా వేసి కలిపి మనము పక్కన పెట్టుకున్నాము కదా అవి కాస్త కచ్చ పచ్చాగా మెదిపి మనము తాయారు చేసుకున్న కూరలో వేసి కలిపి కాస్త ఉడుకు పట్టినాక దించాలి . {తగినన్ని నీళ్ళు వేసుకొని వుడికిన్చుకోండి గట్టిగా ఉండకూడదు }
పట్టీ ల తయ్యారి -
ఉడికించి పొట్టు తీసుకున్న బoగాల దుoపలు ఒక గిన్నలోకి తీసుకొని అందులో మిర్చి ముద్ద , అల్లం తురుము , కార్న్ ఫ్లోర్ , ఉప్పు , బ్రెడ్ పొడి ఇంక పసుపు వేసుకొని బాగా కలపాలి .................... తరువాత గుండ్రంగా చేసుకొని పాటీల మాదిరి ...............................
చేసుకొని వీటిని బ్రెడ్ పొడి లో కాని ఓట్ట్స్ కి కాని అద్ది పక్కన పెట్టుకొని .........................
{ఈ పాటీలు అరా అంగుళం మందము వుండాలి}
ఈ తయారు అయిన పాటీలను పెన్నములో నూనే వేసి కాగినాక వేయించుకొని tissue పేపర్ మీద తీసుకోవాలి .
ఇప్పుడు ఇంక ప్లేట్ చేసుకుందాము -
ప్లేట్ లో రెండు ప్లేట్ లో పెట్టుకొని కాస్త కట్ చేసి , రెండు గంటల రగడ వేసుకొని ......... దానిమీద స్వీట్ చట్నీ , గ్రీన్ చట్నీ వేసి దాని పైన ఉల్లి ముక్కలు , బూంది వేసి కాస్త కొత్తిమీర తురుము ఇంక పైన చాట్ మసాలా వేసి వేడి వేడి గా ఇవ్వండి .
No comments:
Post a Comment