సబ్బియం అంటే అందరు పాయసము అలా చేసుకుంటారు కానీ ఉప్మా కూడా చేసుకోవచ్చు తెలుసా , మా అక్కవాళ్ళు ఆదోని లో వుంటారు వాళ్ళు ఎన్నోరకాల వంటలు చేసుకుంటారు చాల బాగుంటాయి తనవి ,మా వారు ఎప్పుడు కొత్త రకాలు కావాలి అని అంటారు అప్పుడు అక్కని అడిగితే ఇది చెప్పింది మేము ఇంకొకలా చేసుకొంటాము వాళ్ళు ఇలా చేస్తారు అంట , అస్సలు మరిచి పోయిన టిఫిన్ తను గుర్తు చేసింది అందుకే ఈవేల ఇది చేశాను ఉదయం , తనకి చాలా నచ్చింది అందుకే మీతో ..................
కావలిసిన పదార్థములు =
కావలిసిన పదార్థములు =
- నైలాన్ సబ్బియం - 1 గ్లాస్ [ ఒక సారి కడిగి మంచి నీరు పోసి మూత ముసి పెట్టుకోవాలి ఒక రాత్రి ]
- ఉల్లిగడ్డలు - 2
- పచ్చిమిరపకాయలు - 3- 4
- ఉప్పు
- చెనక్కాయలు - 1/4 గ్లాస్ [ వేయించి కచ్చ పచ్చగా పొడి చేసుకొని పెట్టుకోవాలి ]
- నూనె - 3 tsp
- తిరవాత గింజలు - 1 tsp [ ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,కరివేపాకు]
తయారు చేసుకునే పద్ధతి =
- నైలాన్ సబ్బియం - 1 గ్లాస్ [ ఒక సారి కడిగి మంచి నీరు పోసి మూత ముసి పెట్టుకోవాలి ఒక రాత్రి ]
- ఉల్లిగడ్డలు పొత్తు తీసుకొని ముక్కలు గ చేసుకొని పెట్టుకోవాలి
- పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి
- పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక తిరవాత గింజలు వేసుకొని వేగినాక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి
- వేగిన వుల్లిగడ్డల్లో మనము ముందుగా నాన బెట్టుకున్న సగ్గుబియ్యము నీళ్ళు లేకుండా వేసుకోవాలి
No comments:
Post a Comment