Top Food Blogs

Thursday, November 22, 2012

KOLLI POLLELU [ TRADITIONAL SWEET ]


ఇది  ఒక స్వీట్  , మా ఇంట్లో  ఇది ఒక  సంప్రదయమమయన  వంట  అని అనుకోవచ్చు  , ఇది  ఎంత మoది కి   తెలుసో నాకు తెలియదు  నేను నాకు తెలిసిన వారిని చాలానే అడిగినాను  ఎవరికీ తెలియదు అని అన్నారు అందుకే ఇది మా  ఇంటి వంట అని అంటాను ,నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను  ఈ స్వీట్  చాల చాలా రుచిగా వుంటుంది మా వారికి చేసి పెట్టాను  తిని  ఇది ఏమి స్వీట్ ఇలా వుంది అని తిన్నారు ఇంకా తింటూ తింటూ  ఎన్ని  ప్రశ్నలో  ఎలా ఏమి ,................................... అని  బలే  ఇదయి పోయారు మా వాడు , మా వారు  ఇద్దరు  నూ ,మరి మీరు నేర్చుకుంటారా మరి,,,, చాలా  సులువే ,....................................

కావలిసిన వస్తువులు = 

మొదట  చిరోటి రవ్వ  / పేణీ  రవ్వ  ఒక  గ్లాస్  ఒక ప్లేట్ లో వేసుకొని  కాస్త నూనె  వేసుకొని  కాస్త ఉప్పు వేసుకొని చేపతి పిండి లా తడిపి  మూత  మూసి  పక్కన  పెట్టుకోవాలి .



పొడి కి కావలిసినవి = 

  • పుట్నాలు / పప్పులు  - 1 గ్లాస్ 
  • బెల్లము - 1/8 గ్లాస్ 
  • జీడిపప్పు - 8 
  • బాదం పప్పులు - 6
  • ఎండు  ద్రాక్ష - 5
  • యాలకలు - 1 [మెత్త గా దంచుకోవాలి] 
  • నెయ్యి - 1 tsp 
  • ఎండు  కొబ్బెర - 4 tsp 
 బెల్లము మొదట దంచి  పుట్నాలతో  కలిపి మిక్సీ  జార్ లో వేసుకొని  మెత్తగా  తిప్పుకొని  ఒక  గిన్నలోకి తీసుకొని [ తీపు ఎవరికీ తగినట్టు వారు వేసుకోండి ] యాలక పొడి , ఒక పేన్నములో  నెయ్యి వేసుకొని  ముక్కలు గా చేసుకున్న జీడిపప్పు,బాదం,ఎండు  ద్రాక్ష  వేసి వేయించుకొని తాయారు చేసుకున్న పొడి లో వేసుకొని బాగా కలుపుకొని ఒక డబ్బా లో వేసుకొని 
మూత ముసి పెట్టు కొండి .


ఇప్పుడు రేకులు / పుల్కాలు  చేసుకోవడానికి కావలిసిన వస్తువులు చూద్దాము పిండి నానే లోపలికి 

  • చేపాతీలు కాల్చేపెన్నము 
  • పుల్క రుద్దడానికి పలక కట్టే 
  • ఒక  వెడల్పు గిన్నలో నీరు 
  • ఒక  ప్లేట్ లో  ఒక  గుండు గున్న ఇలా బోర్లించుకొని  పొయ్యి పక్కన ఇలా పెట్టుకోండి 
  • ఎంతో  ముఖ్యమయిన  ది  కాటన్  బట్ట  ఒక ప్లేట్ లో పరిచి పెట్టుకోండి [పుల్ కా లు వేసుకొని  అదే బట్ట  మూసుకోవాలి  తడి పీల్చి ఆరిపోకుండా  వుంటుంది ఈ వంట ]

ఒక   20 నిముషముల  తరువాత  పిండి ని గుండ్రాయి తో  కాస్త  దంచి చిన్న చిన్న వుoట లు  


చేసుకొని పలక మీద  కాస్త  నూనె  పూసి  పూరీ ల మాదిరి  రుద్ది   చెపాతి  / పుల్క ల మాదిరి  రెండు విపుల కాల్చుకొని [ వత్తుడు పిండి అలా వాడ కూడదు నూనే  లో  అద్ది  పుల్ కా లా రుద్దుకొని  పెన్నము  మీద  వేసుకోవాలి  మల్ల  నూనె  అది ఏమి వెయ కుండా  కాల్చుకోండి  ఎర్రటి చుక్క వస్తే చాలు  మరీ  పుల్కా  అంతఎక్కువ కాల్చ వద్దు  ]
 పక్కన నేరు పోసుకొని పెట్టుకున్న గిన్నలో వేసుకొని 

బాగా ముని గేలా  చూడాలి ఇలా 


అది  నానే లోపలి  కి మల్ల ఇంకొకటి  రుద్ది  పెన్నము  మీద వేసి  నీటి లో నాను తున్న  పుల్క  ని  పక్కన బోర్లిన్చుకున్న  గిన్న మీద వేయండి [ గిన్నను  ఒక ప్లేట్ లో బోర్లించండి  నానిన పుల్క  వేసినప్పుడు ఎక్కువ నీరు కారి పోతుంది]


అలా  కరిపోయినాక అంటే ఇంకొక పూరి  నానినాక  ఈ  గిన్నమీద  వేసుకున్న పుల్క  ని  ఒక కాటన్  బట్టలో పెట్టుకోవాలి .


అలా  ఒకటి రుద్దండి ........పెన్నము మీద కాల్తుంటుంది ఒకటి........................నీటిలో నానుతుంటుంది ఒకటి ............బోర్లించి వున్నా గిన్న మీద నీరు వడుస్తుంది ఒకటి .................... ఇలా  వున్నా పిండి తో  పుల్కాలను  చేసుకొని  కాటన్  బట్టలో  పరుచుకొని ఒక దాని మీద   ఒకటి వేసుకోండి ఏమి కాదు కాని నలగకుండా మూసి పెట్టుకోండి  అదే బట్టను  మూసి  పెట్టుకోండి .

 ఇంక  కావలిసినప్పుడు  మూసిన బట్ట తీసి  ఒక ప్లేట్ లో  ఒక పుల్క  పరిచి 
మొదట తయారు చేసుకున్న పొడి  పుల్క  అంత చల్లుకొని 
కావలి అంటే  నెయ్యి  వేసుకొని  నిదానముగా  చుట్టుకొని ఇలా 


తయ్యారు అవుతుంది  ఎంతో రుచి కరమయిన  మా ఇంటి  వంట కొల్లి పోల్లెలు 

చేసుకున్న రోజు  ఈ  రేకుల ప్లేట్ బట్ట  బయటనే  వుoడనీయండి , తినడము ఆ రోజు అయి పోయిన తారువాత  ఆ  బట్టతో టె ఈ రేకులను / పుల్క ల ప్లేట్   fridge  లో  పెట్టండి . 

మరునాడు  తినడానికి  మూడు ఒక 2 గంటలు  ఈ రేకులు పెట్టుకున్న బట్ట లో పరిచి మూసుకున్న ప్లేట్  బయట పెట్టుకోండి .అప్పుడు ఒకొక్క రేకు తీసుకొని ఎన్ని కావలి అంటే అన్ని పొడి చల్లుకొని ఆరగించండి .అంతే ఒక వారము అయినా బాగుంటుంది . 





PS:Please leave a comment once you are done.
      Thank You!



No comments:

Post a Comment