Top Food Blogs

Wednesday, September 26, 2012

SAAGU WITH POORI [ SIDE DISH ]

పూరి  అంటే  అందరికి ఇష్టమయిన టిఫిన్  దాని లోకి ఎన్నో రకాల కూరలు చేస్తుంటారు  అలాంటిదే  ఇది  సాగు  మా  తమ్ముడు భార్య  వాళ్ళు చేసుకుంటారు  చాలా  బాగుంటుంది  రుచిగా  వుంటుంది  చేసుకొని చూడండి  .

కావలిసిన  పదార్థములు = 


  • ఉల్లిగడ్డలు -  2 
  • వుర్లగడ్డలు - 3 
  • క్యారట్  - 4 
  • పచ్చిమిరపకాయలు - 4
  • ఉప్పు 
  • కొత్తిమీర - కాస్త 
  • పచ్చికొబ్బెర - 1/4 చిప్ప 
  • బెల్లము - 1/4 tsp 
  • నూనె - 1 tsp 
  • తిరవత గింజలు - ఆవాలు ,జీలకర్ర ,మినప బేడలు - అన్ని కలిపి 1/2 tsp ,కరివేపాకు - 8
  • పసుపు - 1/4 tsp 
తయారుచేసుకునే  విధి - 

మొదట ఉల్లిగడ్డలు పొట్టు తీసుకొని ముక్కలు గ చేసుకోవాలి 
క్యారట్  చెక్కు తీసుకొని ముక్కలు చేసుకోవాలి 
వుర్లగడ్డలు చెక్కు తీసుకొని ముక్కలు చేసుకోవాలి 
పచ్చిమిరపకాయలు ,పచ్చికోబ్బెర ముక్కలు,కొత్తిమీర,ఉప్పు,అన్ని కలిపి  మెత్తగా  దంచుకొని పెట్టుకోవాలి .

కుక్కర్  తీసుకొని నునే వేసుకొని తిరవాత గింజలు వేసుకొని వేగినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒక 2 నిముషములు వేయిన్చుకోన్నతరువాత   వుర్లగడ్డ ముక్కలు , క్యారట్ ముక్కలు అన్ని వేసుకొని  వేయించుకొని ఒక రండు నిముషములు  తరువాత పసుపు , బెల్లము తిప్పుకున్న కారము  అన్ని వేసుకొని  బాగా కలిపి ఒక 1/2 గ్లాస్  నీళ్ళు  వేసుకొని  బాగా  కలుపుకొని  కుక్కర్  మూత  పెట్టుకొని ఒక విసిల్ రానిన్చు కొని   పొయ్యి  బంద్  చేసుకొని   

కుక్కర్  మూత  తీయడానికి  వచ్చినాక  ఒక కప్  లో శనగ పిండి  వేసుకొని  నీళ్ళు తీసుకొని పోసుకొని  వుంటలు కట్టకుండ కలుపుకొని  వుడికిన కురగాయలల్లో వేసుకొని  బాగా  కలిపి పొయ్యి ముట్టించి  ఒక 9 నిముషములు  వుడకనిచ్చినాక   దించుకోవాలి  .

శనగ పిండి తో  కుర దెగ్గర పడుతున్ది   .

 ఇది  పూరిలోకి  చాలా బాగుంటుంది 





PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment