Top Food Blogs

Monday, December 5, 2011

VEGETABLE PALAV


పాలావ్ - ఎప్పుడు చిత్రాన్నమ్ము,వాoగిబాతు ఇలా ఒకే రకము అన్నము రకాలే కాదు ఒకొక్క సారి ఇలా పలావ్ కూడా చేసుకోండి బాగుంటుంది ,ఒక గంట లో అవుతుంది తెలుసా మరి మొదలు పెడదాము ..................


కావలిసిన పదార్థములు - 

  1. బియ్యము - 3 చిట్లు [పైన చూయిన్చినదే చిట్టి]{బియ్యము రెండు సార్లు కడిగి పెట్టుకోండి}
  2. క్యారట్ - 5
  3. బీన్స్ - 15 
  4. ఉల్లిగడ్డలు - 3 

మసాలాకు :

  1. అల్లము 
  2. ఎల్లిపాయలు 
  3. కొత్తిమీర
  4. లవంగాలు - 6
  5. చెక్క - కాస్త 
  6. యాలకలు - 4
  7. కాస్త ఉప్పు 
ఇవన్ని కలిపి మిక్సీ లో వేసుకొని పెట్టుకోవాలి ఇలా ..........




తాయారు చేసుకునే పద్ధతి =
మొదట ఉల్లిగడ్డలు కడిగి సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి ఇలా .................



  • పొయ్యి మీద  పెన్నము పెట్టి అర కప్పు నెయ్యి వేసుకోవాలి 
 ఈ కొలత కప్పు  కు నెయ్యి వేసుకోండి .

  • పొయ్యి ముట్టించి గిన్న పెట్టుకొని నెయ్యి వేసుకొని తరుగుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని కాస్త ఏర్ర రంగు మారే  వరకు వేయించుకోవాలి.

  • తరువాత మొదట తాయారు చేసుకున్న మసాల ఇంత పడుతుంది . 
 ఒక చిట్టికి ఒక కుప్ప మసాల అన్నమాట .

  • ఉల్లిగడ్డలు వేగినాక మసాల వేసుకొని బాగా కలుపుతూ 
వుండాలి రంగు మారే వరకు [అంటే కాస్త{brown కలర్}వచ్చేవరకు అన్నమాట]................



  • తరువాత ముక్కలు గా చేసుకున్న క్యారట్,బీన్స్ వేసుకొని మూడు చిట్ల బియ్యముకు ఏడు చిట్ల నీరు పోసుకోవాలి ఉప్పు ఒక 2 tsp [తగినంత] వేసుకొని 
  • electric rice cooker లో పలావ్ సులబంగా చేసు కోవచ్చు మసాల వేయించుకొని ఎసరు పోసుకున్న తరువాత rice cooker లో ఈ నీరు వంచుకొని కడుగు కొన్న బియ్యము మాత్రము ఈ మసాల నీటిలో వేసుకొని cooker on చేసుకోవాలి అంటేcooking mode లో వుంచుకోవాలి,
    అన్నము తాయారు అవుతే keep warm కి పోతుంది అప్పుడు దించుకొని వేడి వేడిగా వడ్డిన్చoడి.


    rice cooker లేని వాళ్ళు ఇలా చేసుకోండి.....................
    ఎసరు కాగినాక కడుగు కున్న బియ్యము వేసుకొని ఉడుకు పట్టుకున్నాక సన్నమంట చేసుకొని మూత  పెట్టుకోండి, [మధ్య మధ్య లో కాస్త కలపండి]అన్నము వుడికినాక పొయ్యి బంద్ చేసుకొని వేడి వేడి గా ఆరగించండి.


    పెరుగు పచ్చడి [raitha]= ఉల్లిగడ్డలు,టమోటా,పచ్చిమిరపకాయలు-4, కొత్తిమీర,పెరుగు[కమ్మటిది]
    అన్ని సన్నగా ముక్కలు చేసుకొని పెరుగులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పలావ్ లో కలుపుకొని ఆరగించండి ..........

    No comments:

    Post a Comment